10-07-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూలై 10: నగరంలోని ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శ్రీదత్తసాయి కాంప్లెక్స్‌లో మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంటల ధాటికి కాంప్లెక్స్ అద్దాలు పగిలి రోడ్డుపై పడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిపమాక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలు అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు ఆ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.