10-07-2024 RJ
సినీ స్క్రీన్
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ’కల్కి 2898 ఏడీ’ను తెలుగు ప్రేక్షకులతో కలిసి చూడాలని ఉందన్నారు ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించిన నేపథ్యంలో దర్శకుడిని ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు. తాజాగా దానికి సంబంధించిన ప్రోమోను నిర్మాణ సంస్థ విడుదల చేసింది. ‘కల్కి’లో చేసినందుకు వస్తోన్న ప్రశంసలు నా నటనకు అనుకోవడం లేదు. ఆ పాత్ర, కాన్సెప్ట్‌కు వస్తున్నాయి. ’కల్కి’లో దీపికా పదుకొణె పాత్ర అద్భుతం. ఈ ఐడియా వచ్చినందుకు మిమ్మల్ని(నాగ్ అశ్విన్) ప్రశంసించాలి. ఆమె నిప్పుల్లో నడుచుకుంటే వచ్చే సన్నివేశం హైలైట్. కానీ అందులో తనకేం కాకుండా చూపించారు. ఈ విషయంపై నేను ప్రేక్షకుల అభిప్రాయాలు తెలుసుకోవాలి.
సినిమా ఎలా ఉందని వాళ్లను అడిగి కనుక్కోవాలి. హైదరాబాద్‌లో ఉన్న తెలుగు ప్రేక్షకుల మధ్య కూర్చొని సినిమా చూడాలి. ఎందుకంటే వాళ్లు సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు’ అని అమితాబ్ అన్నారు. ఇక ’కల్కి’ పూర్తి కాన్సెప్ట్ గురించి నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ’ఇది మహాభారతంలో జరిగే చివరి ఘట్టం’ అని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు ’కల్కి’ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ మూవీ రూ.900 కోట్లకు పైగా వసూలు చేసినట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. అలాగే ఈ సినిమా ఓటీటీ విడుదల గురించి కూడా కొన్ని వార్తలు సోషల్ విూడియాలో ప్రచారమవుతున్నాయి. ఆగస్టు 15నుంచి ఇది ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది.