ad1
ad1
Card image cap
Tags  

  11-07-2024       RJ

అదుపుతప్పిన శాంతిభద్రతలు.. కుప్పకూలుతున్న రియల్‌ రంగం

తెలంగాణ

  • పాతకశీర్షికల్లో వార్తలు వస్తున్నా.. లేని చలనం
  • రేవంత్‌ ప్రభుత్వంపై కెటిఆర్‌ ఆగ్రహం

హైదరాబాద్‌, జూలై 11: ఈ మహానగరానికి ఏమైంది అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు. రియల్‌ రంగం కుప్పకూలిపోతుండగా, శాంతిభద్రతలు అదుపు తప్పాయని అన్నారు. ప్రముఖ పత్రికలు కూడా ఈ నగరానికి ఏమైందని ప్రముఖంగా  వార్తలు రాస్తున్నాయంటే  నగరంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని అర్థమని వివరించారు. పరిపాలనా అనుభవం లేని నాయకత్వం ఎలా ఉంటుందో హైదరాబాద్‌ నుంచి తెలంగాణ పల్లెటూరు వరకూ అంతటా కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘బ్రాండ్‌ హైదరాబాద్‌‘ ఎందుకు మసకబారుతోంది. విశ్వనగరంగా ఎదుగుతున్న వేళ.. ఎందుకింత కళ కోల్పోతోందని సగటు హైదరాబాదీకి అనిపిస్తుందని కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ ను ప్రేమించే ప్రతిఒక్కరిలో ఇదే ఆవేదన ఉందని తెలిపారు. పదేళ్లు ప్రశాంతంగా ఉన్న నగరంలో వరుస హత్యలు.. అంతరాష్ట్ర ముఠాలు పెరిగిపోతున్నాయని,పేట్రేగిపోతున్న అన్నారు.

రాజధాని హైదరాబాద్‌లో శాంతి లేదని.. నగర ప్రజల జీవితాలకు భద్రత లేదని కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం గారు స్వయంగా పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ కు వస్తున్నా.. పోలీసింగ్‌పై కమాండ్‌ ఏది అని ప్రశ్నించారు. క్షీణిస్తున్న శాంతిభద్రతలపై కంట్రోల్‌ ఏది అని నిలదీశారు. ఓవైపు.. కుప్పకూలిన రియల్‌ ఎస్టేట్‌ రంగం.. పరిపాలనా వైఫల్యాన్ని వేలెత్తి చూపుతోందని తెలిపారు. మరోవైపు.. పడగవిప్పిన హత్యల సంస్కృతి.. ప్రతి కుటుంబంలో వణుకు పుట్టిస్తోందన్నారు. ఇంకోవైపు.. తరలిపోతున్న పెట్టుబడుల పర్వం.. యువత ఉపాధి అవకాశాల్ని దెబ్బతీస్తోందని చెప్పారు. కాంగ్రెస్‌ పవర్‌ లోకి రాగానే గడియ గడియకు ఏమిటీ.. పవర్‌ కట్‌ అని కేటీఆర్‌ ప్రశ్నించారు. సేఫ్‌ సిటీగా ఉన్న మహానగరంలో క్రైమ్ రేట్‌ ఎందుకు పెరిగిపోతుందని నిలదీశారు. ఇదేనా విూరు తెస్తానన్న మార్పు అని మండిపడ్డారు.

విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి.. పదేళ్లు కష్టపడి పునాదులు వేస్తే.. అధికారంలోకి రాగానే ఆగం చేస్తే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంతో పోటీపడే నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌ ప్రగతికి అర్దాంతరంగా బ్రేకులు వేస్తే ఎలా?? దేశ రాజధాని చుట్టూ.. రాజకీయ చక్కర్లు కొట్టడంపై ఉన్న శ్రద్ధ.. చిక్కుల్లో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర రాజధానిపై లేకపోతే ఎలా ?? అని మండిపడ్డారు. హైదరాబాద్‌ అంటే.. కేవలం రాజధాని కాదు..తెలంగాణ ఎకనమిక్‌ ఇంజన్‌ అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఇకనైనా.. కాంగ్రెస్‌ సర్కారు మేల్కొనకపోతే.. మన హైదరాబాద్‌ దెబ్బతింటే.. యావత్‌ దేశానికి కూడా నష్టమని కెటిఆర్‌ తెలిపారు.

08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

03, Sep 2024

బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది: సీఎం రేవంత్

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP