11-07-2024 RJ
తెలంగాణ
భద్రాద్రి, జూలై 11: యాదాద్రి తరహాలోనే భద్రాద్రిని కూడా అద్భుత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దే సంకల్పానికి ముహూర్తం కుదరడం లేదు. మరోవైపు పోలవరంతో భద్రాద్రికి ముప్పు అన్న ఆందోళన వస్తోంది. ఈ రెడు విషయాలపై ఎలాంటి స్పందనా కానరావడం లేదు. మరోవైపు భద్రాద్రి రక్షణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. భద్రాచలం ఆలయ అభివృద్ధికి సంబంధించిన మాస్టర్‌ప్లాన్ రూపకల్పన పై గతంలో మంత్రి తుమ్మల తదితరులతో చర్చించారు. పలుసూచనలు చేశారు. ఆలయ అధికారులు, దేవస్థానం పండితులు, స్తపతులతో కలిసి భద్రాద్రి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ గురించి చర్చించారు. కానీ అవన్నీ పక్కకుపోయాయి. తుమ్మల రాజకీయంగా మళ్ళి తెరపైకి వచ్చారు.
ఈ క్రమంలో ప్రస్తుతం మాస్టర్‌ప్లాన్ రూపొందించాలని స్థానికులు కోరుతున్నారు. యాదాద్రిలాగా కాకాపోయిన కొంతయినా చేసి భద్రాద్రిని పునర్నించాలని కోరుతున్నారు. భద్రాద్రి ఆలయాన్ని జాతీయస్థాయిలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలన్నదే తెలంగాణ ప్రభుత్వ సంకల్పంగా ఉందని నాటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఇక్కడ ఏటా శ్రీరామ నవమి, సీతారామ చంద్రస్వామి కల్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అయినా ఆలయ అభివృద్ది ప్రణాళిక మాత్రం ముందుకు సాగడం లేదు. ఆలయ అభివృద్దిని చేపట్టి భద్రాద్రిని పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దాలని స్థానికులు కోరుతున్నారు.