11-07-2024
తెలంగాణ
హైదరాబాద్, జూలై 11: పన్నులపై వడ్డీలవిూద వడ్డీల భారం పడడంతో, ఇంటిపన్నుల వసూళ్లు మందగించాయి. గ్రామాలు, పట్టణాల్లో ఇంటిపన్ను వసూళ్లు మందకొడిగా సాగుతున్నాయి. పట్టణాలు విస్తరించడం,కొత్తగా మున్సిపాలిటీలు ఏర్పడ్డా ప్రజల ఆదాయవనరులు పెరగడం లేదు. దీంతో పట్టణాల్లో వ్యాపారాలు చితికి పోతున్నాయి. పురపాలికలు రోజు రోజుకు విస్తరిస్తుండగా, ఆ మేరకు ఆదాయం రావడం లేదు. పట్టణం అభివృద్ధి చెందడంతో పాటు ఓవైపు మాల్స్, వ్యాపార సముదాయాలు, మరోవైపు ఇళ్ల నిర్మాణాలు పెరుగుతున్నాయి. కానీ ఆ స్థాయిలో ఆదాయం మాత్రం పెరగడం లేదని అంటున్నారు. మున్సిపాలిటీల పరిధిలోని దుకాణాల విషయంలో కొందరు అద్దె చెల్లిస్తుండగా, మరికొందరు పెండింగ్‌లో పెట్టడంతో మునిసిపల్ ఆదాయం దెబ్బతింటోంది. లీజుకు తీసుకున్న వారు పెద్ద మొత్తంలో సబ్ లీజుకు దుకాణాలను ఇచ్చుకుంటున్నారు. దీనివల్ల కూడా రావలసిన ఆదాయం రాకుండా పోతోంది.
మునిసిపాలి టీకి పన్నుల వసూలు కూడా అంతంత మాత్రంగానే ఉంది. పన్ను వసూల్ళలో నిర్లక్ష్యం వహించడం వంటి కారణాల వల్ల మునిసిపాలిటీకి రావాల్సిన మేర ఆదాయం రావడం లేదని తెలుస్తోంది. మాల్స్, వ్యాపార సముదాయాలు, ఇళ్ల నిర్మాణాలు విస్తరిస్తుండటంతో పట్టణం రోజురోజుకు పెరుగుతోంది. అయితే ఆ స్థాయిలో ఆదాయం మాత్రం రావడం లేదు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు సమకూర్చా లంటే పన్నుల రూపంలో ప్రజలు ఆదాయం చెల్లించాల్సి ఉంది. అధికార యంత్రాంగం నిర్లిప్తత, కింది స్థాయి ఉద్యోగుల ఉదాసీనత కారణంగా సరైన అస్సెస్‌మెంట్ చేయకపోవడం వల్లే పట్టణం పరిగినంత వేగంగా ఆదాయం పెరగడం లేదని తెలుస్తోంది.