ad1
ad1
Card image cap
Tags  

  11-07-2024       RJ

తిరుమలలో ఇక భక్తులదే రాజ్యం

ఆంధ్రప్రదేశ్

  • దేవుడిని టచ్‌ చేశారు.. ఫలితం అనుభవించారు
  • ఎర్రదొంగలను వదిలేది లేదన్న బండి

తిరుమల, జూలై 11: శ్రీవారి ఆస్తులకు పంగనామాలు పెట్టిన నయవంచకులు పోయారని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. ఇప్పుడు స్వామివారికి నిత్యం సేవ చేసే రాజ్యం వచ్చిందని చెప్పారు. గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. తన పుట్టినరోజు సందర్బంగా బండి సంజయ్‌ శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు స్వాగతం పలికి, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందచేశారు. ఈ నేపథ్యంలో వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు బండి. తిరుమలలో శ్రీవారి ఆస్తులకు పంగనామాలు పెట్టిన నయవంచకులు దిగిపోయారని అన్నారు. ఎర్రచందనం పేరుతో జాతీయ సంపదను పూర్తిగా కొల్లగొట్టారని మండిపడ్డారు. స్వామివారిని టచ్‌ చేశారు కాబట్టే ఘోరంగా ఓడిపోయారని అన్నారు. దేవుడి ఆస్తులను దోచుకొని తింటే ఎవ్వరికైనా ఇలాంటి గతే పడుతుందని అన్నారు. జగన్‌ హయాంలో టీటీడీ రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిందని బండి ఫైర్‌ అయ్యారు. ఎర్రచదనం దొంగలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. నయవంచ కులు పోయి, స్వామి వారికి నిత్యం సేవ చేసే సేవకులు వచ్చారని అన్నారు.

ఏపీలో గత వైకాపా ప్రభుత్వ పాలకులు వీరప్పన్‌ వారసులని అబివర్ణించారు.  ఎర్రచందనం పేరుతో జాతీయ సంపదను దోచుకున్నారు. ఆ డబ్బుతో రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకున్నారు. ఎర్రచందనం దొంగలను వదిలిపెట్టేదే లేదని ఈ సందర్భంగా కేంద్రమంత్రి హెచ్చరించారు. గత అరాచక ప్రభుత్వంలో స్వామివారి నిధులను పక్కదారి పట్టించి తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు. శేషాచలం కొండల్లో ఎర్రచందనం దోపిడీపై నివేదిక కోరతాం. దాని ఆధారంగా జాతీయ సంపదను దోచుకున్న వారిపై చర్యలు తీసుకుంటాం అని వెల్లడిరచారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై గతంలోనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌, తిరుపతి భాజపా నాయకులు అనేక పోరాటాలు చేశారు. కొండ విూద అరాచక పాలన ముగిసింది. ఇన్నాళ్లు భక్తులు ఎదుర్కొన్న సమస్యలు తొలగి పరిస్థితులు చక్కబడ్డాయి. స్వామివారి ఆస్తుల పరిరక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటాం. నరేంద్ర మోదీ దేశాన్ని విశ్వగురువుగా చేసేందుకు కృషి చేస్తున్నారు. ఆయన సారథ్యంలో భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారుతోందని బండి సంజయ్‌ అన్నారు.

31, Aug 2024

ఏపీలో భారీ వర్షాలుతో.. ఏడుగురి మృతి

21, Aug 2024

అనకాపల్లి జిల్లాలో.. ఫార్మా యూనిట్‌లోని రియాక్టర్‌ పేలుడు, 14 మంది మృతి

15, Aug 2024

ప్రతి ఇల్లు, కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఆంధ్రా సీఎం పిలుపునిచ్చారు

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP