11-07-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూలై 11: ఈసారి కేంద్ర బడ్జెట్‌లో సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను తీసుకుని రావాలని కోరుతూ కేంద్రమంత్రి బండి సంజయ్‌కు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. అయితే రెండోసారి విూరు ఎంపీ కావటం, కేంద్రంలో కూడా మంత్రిగా పదవి దక్కటంతో సిరిసిల్ల నేతన్నలకు సేవ చేసేందుకు విూకిది సరైన సమయం అని గుర్తించండి అని తెలిపారు. పదేళ్లుగా ప్రతి బడ్జెట్‌లో కేంద్రం తెలంగాణకు మొండిచెయ్యి చూపిందని గుర్తు చేశారు. అనేకసార్లు పవర్‌లూమ్ క్లస్టర్ కోసం పదిసార్లు కేంద్రానికి లేఖలు, స్వయంగా కలిసి కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేసిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ సారైనా సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను తెప్పించండి. కేంద్ర మంత్రిగా విూకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి. ఈసారి కేంద్రబడ్జెట్‌లో సిరిసిల్లకు శుభవార్త అందేలా చూడాలని బండి సంజయ్‌ను కేటీఆర్ కోరారు. సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కృషి చేయాలని కేటీఆర్ కోరారు.
కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వమే అధికారంలో ఉన్నందున ప్రధాని మోదీని ఒప్పించి సిరిసిల్లా మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాలన్నారు. గత పదేళ్లుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, విూరు ఈ ప్రాంత ఎంపీగా ఐదేళ్ల క్రితం ఎన్నికయ్యారు కానీ నేతన్నలకు ప్రతిసారి నిరాశానే ఎదురైందన్నారు. గతంలో పదేళ్లుగా సిరిసిల్ల ప్రాంతానికి మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను తీసుకొచ్చేందుకు తాను ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కేంద్రం నుంచి సరైన స్పందన రాలేదన్నారు. సుమారు పదిసార్లు కేంద్రంలో స్మత్రి ఇరానీ, అరుణ్ జైట్లీ వంటి అనేక మంది మంత్రులను నేను స్వయంగా కలిసినా దక్కింది శూన్యం అన్నారు. బండి సంజయ్‌ను కూడా ఎన్నోసార్లు ఈ అంశంలో సహకారం అందించాలని కోరినప్పటికీ విూరు పట్టించుకోలేదని అన్నారు. ఈ సారి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న ఈ బ్జడెట్‌లో సిరిసిల్ల ప్రాంతానికి మెగా పవర్ లూమ్ కస్టర్‌ను ప్రకటించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సిరిసిల్లలో మళ్లీ నేతన్నల ఆత్మహత్యలు మొదలయ్యాయని, ఉపాధి లేక ఇక్కడి కార్మికులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న సంగతి విూరు గుర్తించండన్నారు.
గత ప్రభుత్వం నేతన్నల కోసం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ సర్కారు పాతరేయడంతో చేనేత రంగం మరోసారి పదేళ్ల తర్వతా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. సిరిసిల్ల నేతన్నలను ఆదుకోవాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అనేక సార్లు కోరినా, ప్రభుత్వం పట్టించుకోవటం లేదని కేటీఅర్ ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికులు కష్టాల్లో ఉన్న ఈ కీలక సమయంలో వారిని ఆదుకునే మంచి అవకాశం ఇప్పుడు కేంద్రం చేతుల్లో ఉందన్నారు. సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తే ఇక్కడి నేతన్నల కష్టాలు కొంత మేరకు తీరుతాయని, చేతినిండా పని దొరికి మళ్లీ ఆత్మహత్యలు లేని సిరిసిల్లను చూసే అవకాశం ఉంటుందన్నారు. క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన నైపుణ్యం కలిగిన కార్మికులు, వనరులు ఈ ప్రాంతంలో పుష్కలంగా ఉన్నాయని, నేతన్నలు, చేనేతలను ఆదుకోవటానికి గత పదేళ్లుగా కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందకపోవటం దురదృష్టకరం, భాదకరమన్నారు. వనరులు లేని రాష్ట్రాలకు సైతం కేంద్రం అనేకరకాల ప్రాజెక్టులను మళ్లిస్తున్నందున, అన్నీ సానుకూలాంశాలున్న సిరిసిల్లాకు మేలు జరిగే దిశగా బండి సంజయ్ చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి బ్జడెట్‌కు ముందుకు ఈ అంశంలో కేంద్రానికి విజ్జప్తి చేసేవారమన్నారు.
ఈ బ్జడెట్ పెట్టే నాటికే ఆర్థిక మంత్రిత్వ శాఖా మంత్రిని కలిసి సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ ప్రాధన్యతను, దాని వల్ల జరిగే లబ్దిని, వారి దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని కోరారు. తెలంగాణ ప్రజలు ఎక్కువ మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్న విూ మాటలు నమ్మి మిమ్మల్ని గెలిపించారని, కానీ గత ఐదేళ్లలో కరీంనగర్‌కు గానీ సిరిసిల్ల నేతన్నలకుగానీ బండి సంజయ్ పదవీకాలంలో జరిగిన ప్రయోజనం ఏవిూ లేదన్నారు. బీజేపీ పాలిత రాష్టాల్ర ఎంపీలు మాత్రం తమ ప్రాంత ప్రయోజనాల కోసం కేంద్రంతో పోరాటం చేసి తమ ప్రాంతాలకు నిధులను, పరిశ్రమలను తరలించుకుపోతున్నారని, కనుక తెలంగాణ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని మన ప్రాంత ప్రయోజనాల కోసం కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ బడ్జెట్ లో కచ్చితంగా సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ ప్రకటన చేయిస్తారని భావిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.