11-07-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జులై 11: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ సభ్యులు బీర్ల ఐలయ్య నీ లాయర్స్ పోరంపర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రముఖ హైకోర్టు న్యాయవాది నర్రి స్వామి కుర్మ మర్యాదపూర్వకంగా కలిసి న్యాయవ్యవస్థలోని సమస్యల పైన చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు ప్రముఖ న్యాయవాది నర్రి స్వామి కుర్మ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని న్యాయవ్యవస్థలో జరుగుతున్న అన్యాయాల మీద దృష్టిసరించాలని ముఖ్యంగా నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం న్యాయవ్యవస్థలోని తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అధికారులు పీపీల నియమాకంలో ఏపీపీల నియమాకలలో నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ట్రాన్స్ఫర్ విధానాన్ని నిర్వహిస్తున్నారు.
వారిపై సరైన విచారణ జరిపించాలని మరియు క్యాడర్ పీపీల ట్రాన్స్ఫర్ విషయంలో గత పది సంవత్సరాలుగా హైదరాబాదులో పనిచేస్తున్న వారిని రొటేషన్ విధానంలో జిల్లాస్థాయి కోర్టులకు ట్రాన్స్ఫర్ చేయవలసిన అవసరం ఉన్నది వివిధ జిల్లాలో పనిచేస్తున్నటువంటి వాళ్ళని హైదరాబాదులో పోస్టింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది మరియు అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులకు ప్రతి బార్ ఆసోసియేషన్ నుంచి టెన్యూర్ పీపీలుగా అవకాశాలు కల్పించవలసిన బాధ్యత ఉన్నది ఇలాంటి విషయాలు అన్నిటిని కూడా తుంగలో తొక్కి తెలంగాణ రాష్ట్ర ప్రాసిక్యూషన్ ఆఫ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి తన ఇష్టానుసారం జీవోలని సృష్టించి ప్రాక్టీసింగ్ అడ్వకేట్ కి దక్కవలసినటువంటి పోస్ట్ తెలంగాణ ప్రాసిక్యూషన్ ఆఫ్ డైరెక్టర్ ని నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ మరియు నాన్ లోకల్ వ్యక్తులకు రాజకీయ ప్రలోభాలతో ఇవ్వడం జరిగింది.
కాబట్టి వీటన్నిటి పైన సమగ్ర విచారణ జరిపించాలని మా లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నామనీ తెలియజేశారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు నరహరి వినోద్ శ్రావణ్ తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర నాయకులు కె.వి శంకర్ ,కొలను ఆనంద్, ముశం చంద్రశేర్, హరిబాబు జగన్ నరసింహ అనేకమంది సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.