ad1
ad1
Card image cap
Tags  

  12-07-2024       RJ

చెత్తతో సంపదను సృష్టిద్దాం.. ప్లాస్టిక్‌ భూతాన్ని తరిమేస్తేనే మనుగడ

ఆంధ్రప్రదేశ్

  • పంచాయితీల్లో చెత్తతో అనేక ఉపయోగాలి
  • నీటి కాలుష్యాన్ని అరికట్టాలన్నదే సంకల్పం
  • పిఠాపురం నుంచే ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తాం
  • అధికారులతో సవిూక్షలో డిప్యూటి సిఎం పవన్‌ కళ్యాణ్‌

అమరావతి, జూలై 12: చెత్త నుంచి కూడా సంపద సృష్టించి ఆదాయం పెంచుకునేలా మార్గాలు అన్వేషించాలని డిప్యూటి సిఎం పవన్‌ కళ్యాణ్‌ సూచించారు. ఇదే లక్ష్యంతో సాలిడ్‌ అండ్‌ లిక్విడ్‌ రిసోర్స్‌ మేనేజ్మెంట్‌ ప్రాజెక్ట్‌  చేపట్టినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. తాడేపల్లిలోని పంచాయతీ రాజ్‌, గ్రావిూణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కార్యాలయంలో గురువారం ఆ శాఖపై అధికారులతో సవిూక్ష నిర్వహించారు. తొలిసారి కార్యాలయానికి వచ్చిన ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను పవన్‌ సందర్శించారు. అనంతరం ఎస్‌ఎల్‌ఆర్‌ఎం వర్క్‌ షాప్‌లో పాల్గొన్నారు. దీనిపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చిన అధికారులు.. భీమవరం, పిఠాపురం, గొల్లప్రోలులో ఈ ప్రాజెక్ట్‌ అమలు చేస్తున్నట్లు వివరించారు. డ్రైనేజ్‌ టు డైమండ్‌ అనే కాన్సెప్ట్‌తో ఈ ప్రాజెక్టును రూపొందించారని ఎల్‌ఎల్‌ఆర్‌ఎం రిసోర్స్‌ ప్రతినిధి శ్రీనివాసన్‌ పేర్కొన్నారు.

12 గంటల్లో చెత్తను కలెక్ట్‌ చేయగలిగితే అది సంపదే అవతుందని.. పనికి రాని చెత్త వేరే అవసరాలకు సంపదగా మారుతుందని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. పిఠాపురంలో తొలిసారిగా ఎస్‌ఎల్‌ఆర్‌ఎం ప్రాజెక్ట్‌ చేపడతు న్నామని.. శ్రీనివాసన్‌ గత రెండు దశాబ్దాలుగా ఈ ప్రాజెక్టుపై పని చేస్తున్నారని చెప్పారు. ప్రజలు సైతం ఈ ప్రాజెక్టులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దీనిపై అవగాహన కల్పించేందుకు మాస్టర్‌ ట్రైనర్స్‌ను సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. ’పంట కాల్వ కనిపిస్తే కొందరు డంపింగా యార్డుగా మార్చేస్తున్నారు. పంచభూతాల్లో నీరు ఉంది. నీటిని మనం పూజలకు ఉపయోగిస్తాం. అలాంటి జలాన్ని కాలుష్యం కాకుండా కాపాడుకోవాలి. ప్రస్తుతం పర్యావరణానికి అతి పెద్ద సమస్య ప్లాస్టిక్‌. ప్లాస్టిక్‌, చెత్తా చెదారంతో ఇబ్బందులు వస్తున్నాయి. మనం గోవులను పూజిస్తాం. ప్లాస్టిక్‌ కవర్లు తినడం వల్ల ఆవులు చనిపోవడం బాధాకరం.

ఎస్‌ఎల్‌ఆర్‌ఎం ప్రాజెక్టులో ఈ ఇబ్బందులు తొలుగుతాయి. ఈ ప్రాజెక్టును మా కార్యాలయంలో.. మా పార్టీ ఆఫీసులో ప్రారంభిస్తాం. ఈ ప్రాజెక్టును అమలు చేయగలిగితే పంచాయతీలు, మున్సిపాల్టీలకు ఆదాయం వస్తుందని పవన్‌ వివరించారు. మన జీవితంలో చెత్త ఒక భాగంగా మారిందని అన్నారు. మన దేశం నదులు, సంప్రదాయాలు, పూజలకు విలువ ఇస్తామని.. కానీ నదుల సంరక్షణకు చర్యలు తీసుకోబోమన్నారు. పంట కాలువలను డంపింగ్‌ యార్డులుగా మారుస్తున్నారని.. ప్లాస్టిక్‌ కవర్లు ఎక్కడ పడితే అక్కడ పారేస్తున్నారని పవన్‌ పేర్కొన్నారు. వాటిని తిని గోవులు చనిపోతున్నాయన్నారు. గోవులను పూజించడమే కాదు.. వాటి బాగు కూడా చూడాలి. మనకి పనికిరాని వస్తువులతో సంపద సృష్టింవచ్చు. చెత్తను ఊడ్చి పడేయటం వరకే... తరువాత ఏమిటి అని ఆలోచన చేయడం లేదు. పిఠాపురంలో తొలుత ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నాం.

రోజుకు రెండు సార్లు చెత్త కలెక్ట్‌ చేసి.. కొత్త సంపద సృష్టిస్తాం. ప్రజలు కూడా దీనిని బాధ్యత తీసుకుని సహకరించాలని అన్నారు. పైలెట్‌ ప్రాజెక్టుగా పిఠాపురంలో అన్ని కాలనీల్లో అమలు చేస్తాం. మాస్టర్‌ ట్రైనర్స్‌ను ముందు రెడీ చేసి.. వాళ్ల ద్వారా రాష్ట్రం మొత్తం శిక్షణ ఇస్తాం. ఇది వ్యక్తి తో మొదలైనా... వ్యవస్థ మొత్తం అమలు చేయాలి. నా పార్టీ ఆఫీస్‌, నా క్యాంపు ఆఫీస్‌, నా నియోజకవర్గంలో నేను మొదలు పెడతా. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ద్వారా కూడా కొన్ని మార్పులు తీసుకు వస్తాం. పంచాయతీల ద్వారా మోటివేషన్‌ తీసుకు వస్తాం. 101 గ్రామ పంచాయతీల్లో చెత్తతో రూ.2600 కోట్లు ఆదాయం సమకూరింది. రెండున్నర లక్షల మందికి ఉపాధి అవకాశాలు వచ్చాయి. స్వచ్చాంధ్ర ద్వారా దీనిని ప్రజల్లోకి తీసుకెళతాం. ప్రజలంతా దీనిపై అవగాహన పెంచుకోవాలి. చెత్త ద్వారా వచ్చే సంపదను ఆయా కార్మికులకు కేటాయిస్తాం. బ్లీచింగ్‌ పౌడర్‌కే పంచాయతీల్లో డబ్బులు లేని పరిస్థితి.

పంచాయతీకి నిధులు సమకూర్చే సవాల్‌ను స్వీకరించి ముందుకు సాగుతాం. గ్రామాల్లో రోడ్డు వెంట కొబ్బరి చెట్లు పెంచడం ద్వారా కొంత ఆదాయం సమకూర్చుకుంటాం. పంచాయతీలను అనేక కారణాలతో నిర్వీర్యం చేశారు. సమూలంగా ప్రక్షాళన జరగాలి. స్వయం సమృద్ధిగా పంచాయతీలు ఎదగాలి. అల్లావుద్దీన్‌ అద్భుత దీపంలా అన్ని పరిష్కారాలు ఒకేసారి అయిపోవు. ఈ ప్రాజెక్టును ముందు అమలు చేసి.. ఫలితాల చూసి.. అన్నిచోట్ల అమలు చేస్తాం అని అన్నారు. దీనికి కమ్మిట్మెంట్‌ ఉండే లీడర్‌ షిప్‌ ఉంటేనే ఇది సాధ్యం. పిఠాపురంలో 54 పంచాయతీల్లో మేము చేసేది చేయగా.. యన్‌ఆర్‌ఐలు ముందుకు వస్తే వారి సాయం తీసుకుంటాం అని పవన్‌ పేర్కొన్నారు. సర్వీస్‌ అంటే ఎవరూ రారు.. చెత్తతో సంపద వస్తుంది అంటేనే ముందుకు వస్తారు. అన్ని అనర్దాలకు ఒకే ఐఏయస్‌ కారణం. ఏ సవిూక్ష చేసినా.. ఆయనే మూల కారణం అంటున్నారు. ఆయన ఇప్పుడు సర్వీసులో లేరు.

ఎవరిని బాధ్యులను చేయాలి, నిధులు ఎలా రికవరీ చేయాలి? కేవలం కేసులు పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వం పంచాయతీలకు రాష్ట్ర వాటా ఇవ్వలేదు. కేంద్రం కూడా నమ్మకం పోయి నిధులు ఆపేసింది. 70:30 నిధులు ఇస్తే పని అయ్యేది.. అది జరగలేదు. రకరకాల పేర్లు చెప్పి నిధులు మొత్తం మళ్లించారు. ముందు ఖర్చు పెట్టండి, తరువాత బిల్లు ఇస్తాం అని నమ్మబలికారు. డబ్బులు వచ్చినా.. రోడ్లు వేసిన కాంట్రాక్టర్‌లకు గత ప్రభుత్వం ఇవ్వలేదు. అన్ని వ్యవస్థ ల్లో, పథకాల్లో ఇటువంటి ఛాలెంజ్‌లు ఉన్నాయి. వీటిని పెట్టుకుని వెంటనే అన్నీ చేయాలంటే మాకు సాధ్యం కాదు కదా‘ అని పవన్‌ పేర్కొన్నారు.

31, Aug 2024

ఏపీలో భారీ వర్షాలుతో.. ఏడుగురి మృతి

21, Aug 2024

అనకాపల్లి జిల్లాలో.. ఫార్మా యూనిట్‌లోని రియాక్టర్‌ పేలుడు, 14 మంది మృతి

15, Aug 2024

ప్రతి ఇల్లు, కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఆంధ్రా సీఎం పిలుపునిచ్చారు

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP