12-07-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జూలై 12: నక్సల్స్ చేతిలో హతమైన అరకు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా సోమ భార్య ఇచ్చావతి యోగక్షేమాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. సోమ కుమారుడి చదువు బాధ్యతను తాను తీసుకుంటానని చంద్రబాబు హావిూ ఇచ్చారు. అంతకుముందు సీఎం సచివాలయానికి వెళ్తూ ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. సమస్యలతో వచ్చిన వారిని చూసి రోడ్డుపైనే కాన్వాయ్ ఆపారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకుని వినతులను స్వీకరించారు. వైకాపా గూండాల దాడిలో సర్వస్వం కోల్పోయానని.. ఆదుకోవాలని సీఎంను అరకు సర్పంచ్ శ్రీనివాస్ కోరారు. సమస్యను పరిష్కరిస్తానని చంద్రబాబు హావిూ ఇచ్చారు.