12-07-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జూలై 12: అనంతపురంలో అనువైన భూమి చూపితే విమానాశ్రయం ఏర్పాటుపై అధ్యయనం మొదలుపెడతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. ఉద్యాన ఉత్పత్తుల ఎగుమతుల కోసం ఇక్కడ ఎయిర్‌పోర్టు ఏర్పాటుచేయాలని రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్, స్థానిక ఎంపీలు అంబికా లక్ష్మీనారాయణ, బీకే పార్థసారథి ఇటీవల చేసిన విజ్ఞప్తిపై ఆయన స్పందించారు. విమానాశ్రయానికి కావాల్సిన భూమి చూపితే తదుపరి కార్యాచరణ చేపడతామన్నారు.ఇందుకు 1,200 ఎకరాలు అవసరమవుతాయని పేర్కొన్నారు. గన్నవరం విమానాశ్రయం అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎయిర్ పోర్ట్ అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గన్నవరం ఎయిర్ పోర్ట్ అంతర్జాతీయ టెర్మినల్ పనులు గత ప్రభుత్వం హయాంలో అటకెక్కాయి.. గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయకపోవడం దారుణమని విమర్శించారు.
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎయిర్ పోర్ట్ టెర్మినల్ అభివఅద్ధి పనులను సంవత్సరంలోపు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు. ఇక, కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడుతూ.. గన్నవరం ఎయిర్ పోర్టు అభివృద్ధికి కృషి చేసి రాష్ట్రంలో నెంబర్ వన్ స్థాయిలో నిలుపుతామన్నారు. విమానాశ్రయం అభివృద్ధికి అను విధాలుగా కృషి చేస్తాను అని హావిూ ఇచ్చారు. గత ప్రభుత్వంలో పనులను ఎయిర్ పోర్టుల్లో సందర్శించి సవిూక్షించారు.. పనుల్లో జాప్యం ఉంటే కాంట్రాక్టర్లను మార్చాలి.. అంతేగాని గత వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఎయిర్ పోర్ట్ పనులు నిలిపి వేసి చోద్యం చూశారని కేంద్రమంత్రి మండిపడ్డారు. మా ఎన్డీయే ప్రభుత్వంలో కేవలం 9 నెలలోనే ఎయిర్ పోర్ట్ ను అంతర్జాతీయ టెర్మినల్స్ ను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామన్నారు. ఎయిర్ పోర్టులో అంతర్జాతీయ టెర్మినల్ పనులు సవిూక్షించి అధికారులకు దిశా నిర్దేశర చేశారు.