13-07-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జూలై 13: అమరావతి నగరంలో నూతన ఆధ్యాత్మిక ఒరవడికి శ్రీకారం చుట్టటం శుభసంకేతమని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. దేవాలయాల్లో కూడా రాజకీయాలు చొరబడి, ఆలయాలు నిర్మించకుండా చేసిన ప్రభుత్వాలను మనం చూశామన్నారు. దేవుడు ఉన్నాడు కాబట్టే ఎన్నో అవరాధాలు అధిగమించి గోకుల క్షేత్రం నిర్మాణానికి చంద్రబాబు సారధ్యంలో మార్గం సుగమమైందన్నారు. సమాజంలో ఆధ్యాత్మికతతో పాటు సంస్కృతి, ఆచార వ్యవహారాలను కాపాడటం ఎంతో ముఖ్యమన్నారు. ఇందులో ఇస్కాన్ సంస్థ ముందుండటంతో పాటు ఎంతోమందికి అన్నదానం కూడా చేస్తోందన్నారు. రానున్న రోజుల్లో అన్నా క్యాంటీన్లను సీఎం చంద్రబాబు ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించడటం శుభపరిణామమని ఎన్వీ రమణ పేర్కొన్నారు. అక్షయపాత్ర ద్వారా గతంలో అన్న క్యాంటీన్లకు ఇస్కాన్ సంస్థ ఎంతో తోడ్పాటునిచ్చిందన్నారు.
ఎవరూ అర్థాకలితో ఉండకూడదనే లక్ష్యంతో ఇస్కాన్ సంస్థ ఎంతోమందికి అక్షయపాత్ర ద్వారా అన్నదానం చేస్తోందన్నారు. అమరావతి నగరంలో నూతన ఆధ్యాత్మిక ఒరవడికి శ్రీకారం చుట్టటం శుభసంకేతమన్నారు. దేవాలయాల్లో కూడా రాజకీయాలు చొరబడి, ఆలయాలు నిర్మించకుండా చేసిన ప్రభుత్వాలను మనం చూశామని పేర్కొన్నారు. దేవుడు ఉన్నాడు కాబట్టే ఎన్నో అవరాధాలు అధిగమించి గోకుల క్షేత్రం నిర్మాణానికి చంద్రబాబు సారధ్యంలో మార్గం సుగమమైందని ఎన్వీ రమణ అన్నారు. సమాజంలో ఆధ్యాత్మికతతో పాటు సంస్కృతి, ఆచార వ్యవహారాలను కాపాడటం ఎంతో ముఖ్యమని ఎన్వీ రమణ పేర్కొన్నారు. అక్షయపాత్ర ద్వారా గతంలో అన్న క్యాంటీన్లకు ఇస్కాన్ సంస్థ ఎంతో తోడ్పాటునిచ్చిందన్నారు. ఎవరూ అర్థాకలితో ఉండకూడదనే లక్ష్యంతో ఇస్కాన్ సంస్థ ఎంతోమందికి అక్షయపాత్ర ద్వారా అన్నదానం చేస్తోందని ఎన్వీ రమణ పేర్కొన్నారు.