21-07-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జులై 21: తెలంగాణ సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో కోర్ కమిటీ రాష్ట్ర సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం కంటెస్టెండ్ ఎంపీ అభ్యర్థి, మునుగోడు నియోజకవర్గ కంటెస్టెండ్ ఎమ్మెల్యే అభ్యర్థి చౌటుప్పల్ కోర్టు బార్ అసోసియేషన్ లైబ్రరీ కార్యదర్శి హైకోర్టు ప్రముఖ న్యాయవాది నర్రి స్వామి కురుమ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలందరూ అనేక చట్టాల మీద ఆర్టిఏ చట్టాన్ని ఉపయోగించి సమాచారాన్ని సేకరించి గ్రామీణ స్థాయిలో పేద ప్రజలకు ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ నిధులు అందే విధంగా కృషి చేయాలన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ సామాజిక చైతన్యక రాష్ట్ర కోర్ కమిటీ నిర్ణయం మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థన నారాయణపురం మండలం జనగామ గ్రామానికి చెందిన అందోజు రామ ప్రతిజ్ఞ చారిని తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేస్తూ ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన రామ ప్రతిజ్ఞ చారి మాట్లాడుతూ.. నా శక్తి వంచన లేకుండా ఈ సంస్థ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
నాకు ఈ బాధితులు అప్పచెప్పిన తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు నర్రి స్వామి కురుమ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాన అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో తెలంగాణ సామాజిక చైతన్య వేదిక నాయకులు మూశం చంద్రశేఖర్ కోలను ఈశ్వర్, చైతన్య, వీరస్వామి, జగన్, నరసింహ రవి లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.