24-07-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జులై 24: తెలంగాణ సామాజిక చైతన్య వేదిక నాయకులు ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా.. తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు లాయర్స్ ఫోరమ్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చౌటుప్పల్ కోర్ట్ బార అసోసియేషన్ లైబ్రరీ కార్యదర్శి, మునుగోడు నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం కంటెస్టెండ్ ఎంపీ అభ్యర్థి హైకోర్టు ప్రముఖ న్యాయవాది శ్రీ నర్రీ స్వామి కురుమ పాల్గొన్నారు. అయన మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రతి ప్రైవేటు మరియు కార్పొరేట్ స్కూళ్లలో ఒకటవ తరగతి నుండి 8వ తరగతి వరకు బడుగు బలహీన వర్గాలకు చెందిన పేద ప్రజలకు 25% సీట్లను కేటాయించాలని మనకు విద్యా హక్కు చట్టం 2009 ఒక ప్రాథమిక హక్కుగా ఈ యొక్క చట్టంలో పొందుపరచడం జరిగింది.
కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా పేద ప్రజలకు విద్య హక్కు చట్టం అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు ప్రతి యొక్క సామాజిక కార్యకర్త ఈ విద్యా హక్కు చట్టం 2009 అమలు కోసం సామాజిక ఉద్యమాలు నిర్వహించడానికి సిద్ధమై ఉండాలని తెలియజేశారు కార్యక్రమంలో తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర నాయకులు బాలకృష్ణ, అనిల్ , రామ ప్రతిజ్ఞ చారి, కొలను ఈశ్వర్, ముషం చంద్రశేఖర్, జగన్, అనేకమంది సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.