26-07-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జులై 26: చౌటుప్పల్ కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన చౌటుప్పల్లో సబ్ ఏర్పాటు చేయాలని గత మూడు రోజులుగా కోర్టు బహిష్కరించి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు లాయర్స్ ఫోరం ఫర్ ప్రధాన కార్యదర్శి చౌటుప్పల్ కోర్టు బార అసోసియేషన్ లైబ్రరీ కార్యదర్శి హైకోర్టు ప్రముఖ న్యాయాలు నర్రి స్వామి కురుమ పాల్గొని మాట్లాడుతూ.. హైదరాబాద్ దగ్గరగా సబ్ కోర్టు ఏర్పాటుకి అన్ని వసతులు కలిగి ఉండి సబ్ కోర్ట్ ఏర్పాటుకి సంబంధించిన 380 పైచిలుకు కేసులు చౌటుప్పల్ కోర్టులో ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా జీవో నెంబర్ 50ని తీసుకొచ్చి రామన్నపేటలో సబ్ కోర్టు ఏర్పాటు చేయడం సరైనది కాదని చౌటుప్పల్ లో సబ్ కోర్ట్ ఏర్పాటు కోసం నిరంతరం లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ తరపున పోరాటాలు నిర్వహిస్తామని తెలియజేశారు.
నిరసన కార్యక్రమం అనంతరం ఆర్డిఓ గారిని కలిసి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాపోలు వేను, టి. పరమేష్ జల్ల రమేష్, పి పరమేష్ మైపాల్ రెడ్డి, స్వాతి, వెంకటాచలం, ఎలమోని శ్రీను, నరసింహారెడ్డి, ఎస్ ఆర్ బిక్షపతి, శేఖర్, మోహన్, జంగయ్య శ్రీకాంత్ అనేకమంది న్యాయవాదులు పాల్గొన్నారు.