27-07-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జులై 27: చౌటుప్పల్ కోర్ట్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో చౌటుప్పల్ కోర్ట్ బార్ అసోసియేషన్ సభ్యులందరూ మూడు రోజులుగా నిరసన కార్యక్రమాలు తెలియజేసిన సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చౌటుప్పల్ మున్సిపాలిటీ చైర్మన్ రాజు వెంటనే స్పందించి సీఎం గారి దృష్టికి సమస్యలు తీసుకపోవడం జరిగింది. ఈ రోజు బార్ అసోసియేషన్ సభ్యులతో కలిసి సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చౌటుప్పల్ కోర్ట్ బార్ అసోసియేషన్ లైబ్రరీ కార్యదర్శి నర్రి స్వామి కుర్మ మాట్లాడుతూ.. జీవో 50 నీ రద్దు చేయాలని న్యాయవాదులంతా నిరసన తెలపడంతో సమస్యల్ని గుర్తించిన స్థానిక ఎమ్మెల్యే సీఎం గారి దృష్టికి సమస్యను తీసుకపోయి పరిష్కరించడానికి కృషి చేయడం చాలా సంతోషకరం.
సమస్యను విన్న వెంటనే అధికారులతో మాట్లాడి ఈ అంశంపై దృష్టి పెట్టాలని చెప్పిన సీఎం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, రాపోలు వేణు, టి పరమేష్, జె రమేష్, మైపాల్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, నరసింహారెడ్డి, సీనియర్ న్యాయవాదులు వెంకటాచలం, ఎలమంచి శ్రీనివాస్, సత్తిరెడ్డి, ఎస్ఆర్ బిక్షపతి, శ్రీకాంత్, జంగయ్య, చంద్రబాబు అనేకమంది స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.