13-08-2024 RJ
తెలంగాణ
లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీ అభ్యర్థి చౌటుప్పల్ బార్ అసోసియేషన్ లైబ్రరీ కార్యదర్శి, లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్రి స్వామి కురుమ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అయన మాట్లాడుతూ.. మన భారతదేశానికి ప్రక్కనే ఉన్న బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల ఉద్యమం నెపంతో అనేక మందిని హింసలకు గురి చేస్తూ చంపటం అనేది చాలా దుర్మార్గం.
అందులో ముఖ్యంగా హిందువులను టార్గెట్ చేస్తూ మహిళలను మానభంగాలు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న వ్యక్తులందరి పైన చర్యలు తీసుకోవాలని మా లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా హిందువులపై జరుగుతున్నటువంటి దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లాయర్స్ పోరం అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ యాదవ్, భీమ్ రావు మహేష్, హనుమంతు పటేల్, మల్లేష్ యాదవ్, సాయిబాబా మరియు అనేకమంది న్యాయవాదులు పాల్గొన్నారు.