12-06-2024 RJ
భక్తి
తిరుమల, జూన్ 12: ధర్మ పక్షపాతులైన పాండవుల శక్తిని గ్రహించక, అహంకరించి దుర్యోధనుడు అనుజులతో సహా పతనమైపోయాడు. అతని అహంకారమే అతడిని అంతమొందించింది. రా.జ్యంవిూద ఆశ అతడిని సర్వనాశనం చేసింది. ధర్మస్వరూపుడు శ్రీరాముడి శక్తిని గ్రహించలేని మూర్ఖుడు దశకంఠుడు రావణుడు నిహతుడైపోయాడు. గోపికల మనసులను చదివిన కృష్ణ పరమాత్మ వారికి తోడునీడై ఆదుకున్నాడు. మనిషిని చూడ్డానికి కళ్లు చాలు, కనిపించనిదాన్ని చూడటానికి వివేకం కావాలి. ఇతరులను అర్థం చేసుకోలేనివాడు సమాజంలో జీవించలేడు.
మనకు ఆపదలు వచ్చినప్పుడే అసలైన బంధువులు, మిత్రులు, హితైషులు ఎవరో తెలుస్తుంది. విశ్వసనీయుడని సాటి మనిషిని గ్రహించగలిగితే, ఆనందం మనకు నీడలా వెన్నంటే ఉంటుంది. మనతో కలిసి నవ్విన మనిషిని మరిచిపోవచ్చు, కానీ కష్టకాలంలో మనతో కలిసి దుఃఖించే మనిషిని మాత్రం మరచిపోకూడదు. రాజకీయాల్లోనూ పాలకులు మన పూర్వీకులను గుర్తెరిగి పాలన సాగించాలి. ప్రజలను విస్మరించిన నాడు దుర్యోధనుడు, దశకంఠుడికి పట్టిన గతే పడుతుంది.