18-11-2023 Srinu
భక్తి
మేళతాళాల మద్య ఘనస్వాగతం
ఆయోధ్యలో నిర్మాణంలో ఉన్న శ్రీరాముని దివ్య భవ్య మందిర ప్రారంభోత్సవం జనవరి 22, 2024న జరగనున్న నేపధ్యంలో ఆ వేడుకను పురస్కరించుకొని దేశంలోని ప్రతి హిందూ కుటుంబానికి అయోధ్యలోని బాల రాముని పూజలో ఉపయోగించిన అక్షతలు, రామాలయ చిత్రపటము చేర్చాలని శ్రీరామ జన్మభూమి తీర్ధ ట్రస్టు నిర్ణయించింది. ఇందులో భాగంగా శ్రీరామ సేవకుల ద్వారా అయోధ్య నుండి శ్రీరాముని అక్షతలు చిత్తూరుకు చేరాయి.
ఈ అక్షతలకు సాంప్రదాయ పద్ధతిలో మేళ తాళాలతో, కోలాటాలతో, జై శ్రీరామ్ నినాదాల నడుమ ఘనస్వాగతం పలుకుతూ రైల్వేస్టేషన్ నుండి శ్రీరామ ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఇందులో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం వివిధ హిందూ ధార్మిక సంస్థలు పాల్గొన్నాయి. అనంతర అక్షతలకు దేవస్థానంలో పూజాదికాలు నిర్వహించారు.