18-11-2023 Srinu
భక్తి
కృష్ణాజిల్లాలో సుప్రసిద్ధ ఆలయాలలో శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఒకటి. ఈ ఆలయం అవనిగడ్డ గ్రామంలో ఉంది. ఈ ఆలయంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సంతాన సుబ్రహ్మణ్య స్వామిగా భక్తులు ఆరాధిస్తారు. ఈ స్వామిని కొలవడం ద్వారా సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం.
నాగుల చవితి సందర్భంగా మోపిదేవిలోని శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్న అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. ప్రతి సంవత్సరం నాగుల చవితి రోజుల భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ సంవత్సరం ఆలయ అధికారులు భక్తులకు పోలీసు, రెవెన్యూ సిబ్బంది సహాయంతో త్రాగునీరు, మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు.
భక్తులకోసం ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ, మచిలీపట్నం, అవనిగడ్డ డిపోల నుండి ప్రత్యేక బస్సలను ఏర్పాటు చేశారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకోవడాని క్యూకట్టరు. ఆలయ పండితులు కల్పవల్లి స్వామికి ఉదయం 2:30 ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్నడూ లేనివిధంగా ఈ సంవత్సరం 70 వేల మందికి పైగా భక్తులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.