18-11-2023 Srinu
భక్తి
కార్తీక మాసంలో శ్రీశైలానికి భక్తులు అధికంగా రావడం తెలిసిన విషయమే.. శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవడానికి రెండు తెలుగు రాష్ట్ర ప్రజలే కాకుండా ఇతర రాష్ట్ర ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి మల్లన్నను దర్శించుకుంటారు. ముఖ్యంగా కర్ణాటక నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.
మాల ధారణ స్వీకరించేవారు, పుణ్య నదులలో పవిత్రమైన స్నానాలు ఆచరించేవారితో మల్లన్న సన్నిధిలో కార్తిక శోభ మొదలయ్యింది. కార్తీక మాసం వచ్చే నెల 23వ తేదీ కార్తిక పౌర్ణమితో ముగిస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాలలో కార్తీకమాసం అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లంగం రెండూ కలిసి ఉన్న శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం.