16-12-2023 RJ
భక్తి
తిరుమల: భగవద్గీతను లోకానికి శ్రీకృష్ణ భగవానుడు అందించారు. అర్జునుడికి కర్తవ్య నిర్వహణ ఎట్లా చేయాలో తెలియక తపన చెందే హృదయానికి ఉపశమనంగా అనుగ్రహించి నటువంటి మహోపదేశం. అర్జునుడికే కాదు, కర్తవ్య నిర్వహణలో ఎదురయ్యే సమస్యలకి సందిగ్ధతకి సమాధానంగా భగవద్గీత ఈ నాటికీ ప్రమాణంగా నిలుస్తుంది. ఏ నాటికీ ప్రమాణంగా నిలుస్తుంది. ఏ పని ఎట్లా చేయాలి, ఎంత వరకు చేయాలి అనే సంశయం కలిగిన వ్యక్తికి ఒక శ్రేయ సాధనంగా భగవద్గీత ఉపయోగపడుతుంది.
నాకు కర్తవ్యం ఏమిటో తెలియట్లేదు కానీ, 'ఏ శ్రేయస్యం నిశ్చితం భూహితన్మే' నేను శ్రేయస్సుని కోరుకుంటున్నాను, నాకేది శ్రేయస్సో అది చెప్పు అని అర్జునుడు అడిగినది. శ్రేయస్సుని పొందాలి అనుకున్నవాడికే ఏమైనా చెప్పడం అవసరం, ఆ శ్రేయస్సు కోరే వ్యక్తి ఏ స్తాయిలో ఉన్నా అందరికి అందేలా శ్రీకృష్ణ భగవానుడు అందించిన ఉపదేశమే భగవద్గీత.
అది వ్యక్తి గతంగా చిన్న స్థాయిలో కావచ్చు, యువ స్థాయిలో కావచ్చు, ఒక గృహస్తుగా జీవించే వ్యక్తి స్థాయిలో కావచ్చు, లేక వ్యాపారమో, వాణిజ్యమో, ఔద్యోగికమో ఏదో రకమైన శ్రేయస్సుని పొందాలి, అది అత్మోజ్జీవనకరమై ఉండాలి అనే వ్యక్తికి భగవంతుడు చేసిన అతి శక్తి వంతమైన ఉపదేశమే శ్రీమద్భగవద్గీత. మనకూ సంశయాలు తీరుతాయి, చేయాల్సిన కర్తవ్యం గుర్తితాం.
చేసే తెలివి కలుగుతుంది. జీవితాన్ని సుఖమయం చేసుకుంటాం. ఉపద్రవాలు వస్తూనే ఉంటాయి, అవి ఉపశమించాలి, అపన్నులైన వ్యక్తులను ఆదుకొనే హృదయ సౌకుమార్యం ఏర్పడాలి. మనం చెదరకుండా ఉండేందుకు మనో ధైర్యం ఏర్పడాలంటే భగవద్గీతను అర్థం చేసుకోవాలి.