29-12-2023 RJ
వెల్నెస్
న్యూ ఢిల్లీ, (డిసెంబర్ 29): బరువు తగ్గడానికి తక్కువ కార్బోహైడ్రేట్లు, ఎక్కువ ప్రొటీన్ తీసుకునేందుకు రకరకాల ఆహార విధానాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. కీటో డైట్ విధా నమైతే శరీరానికి కావాల్సిన శక్తిలో 5-10 శాతాన్ని మాత్రమే పిండిపదార్థాల నుంచి స్వీకరించాలం టోంది. అయితే జంతుమాంసం నుంచి కాకుండా మొక్కల నుంచి మాంసకృత్తులను, ముతక ధా న్యాల నుంచి కొవ్వులు, పిండి పదార్థాలను స్వీకరిస్తే బరువు పెరుగుదల చాలా తక్కువగా ఉంటుందని అమెరికాలో 20 ఏళ్లపాటు 1.23 లక్షల మందిని అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు తేల్చారు.
జంతుమాసం, శుద్ధి చేసిన ధాన్యాలను తినడం వేగంగా బరువు పెరగడానికి దారితీస్తుంది. ఎంత ఆరో గ్యకరమైన ఆహారం తీసుకున్నా బరువు తగ్గుదల అనేది శరీర ద్రవ్యసూచీ (బీఎంఐ) మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఎక్కువ బీఎంఐ ఉన్న స్థూలకాయులు ఆరోగ్యకరమైన శాక సంబంధిత పిండిపదార్థాల ఆహారం తీసుకున్నాక.. ఇతరులతో పోలిస్తే వారిలో బరువు పెరుగుదల 1.63 కిలోల మేర తక్కువగా కనిపించింది. బీఎంఐ 25 లోపు ఉన్నవారిలో ఈ తరుగుదల 0.39 కిలోలుగా నమో దైంది. తీసుకునే ఆహార పరిమాణం మాత్రమే కాదు, దాని నాణ్యత కూడా ముఖ్యమే.