29-12-2023 RJ
భక్తి
అమరావతి, (డిసెంబర్ 29): మలయప్పస్వామివారు వారు పల్లకి ఎక్కి మహాప్రదక్షిణ మార్గంలో స్వామి పుష్కరిణి వద్దకు వచ్చారు. ఇంతలో 'అమ్మవార్లు చెరొక వల్లకీపై అప్రదక్షిణంగా స్వామివారికి ఎదురుగా వచ్చి నిలుచున్నారు. వురాణ పఠనం జరుగుతుండగా అమ్మవార్ల తరఫున జీయ్యంగార్లు వూలచెండ్లతో స్వామివారిని మూడుసార్లు తాడించారు. స్వామివారు బెదిరినట్లుగా నటించి తానేమి తప్పు చేయలేదని అమ్మవార్లను ప్రాధేయపడతారు.
అనంతరం అమ్మవార్లు శాంతించి స్వామివారికి ఇరువైపులా చేరి కర్పూర హారతులు అందుకుని ఆలయానికి చేరుకున్నారు. ఆ తరువాత ఆస్థానం నిర్వహించారు. ఈ ఉత్సవంలో శ్రీ నమ్మాళ్వార్ రచించిన ఆళ్వార్ దివ్య ప్రబంధంలోని పానురాలను నిందా - స్తుతి శైలిలో అర్చకులు పారాయణం చేయడం ప్రత్యేకతకాగా ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్ స్వామి, తిరుమల చిన్నజీయర్ స్వామి తోపాటు ఆలయ అధికారులు పాల్గొన్నారు.