16-01-2024 RJ
భక్తి
తిరుమల, జనవరి 16: ప్రస్తుతం సంక్రాంతి జనవరి 15న జరుపుకుంటున్నాం. మన చిన్నప్పుడు జనవరి 14న జరుపుకునే వారం. ఇలా ఎందుకు అన్నదే ప్రశ్న. 2008వ సంవత్సరం నుండి సంక్రాంతి పండుగ జనవరి 15న రావడం ప్రారంభమయింది. అంతకుముందు 1935 నుండి 2007 వరకు జనవరి 14ననే పండుగ. ఇదో 72 ఏళ్ల సమయం. ప్రతీ 72 సంవత్సరాలకు ఒకసారి పండుగ ఒకరోజు తర్వాతకు మారుతుంది.
1935 నుండి 2007 వరకు జనవరి 14న,... 2008 నుండి 2080 వరకు జనవరి 15న,...2081 నుండి 2153 వరకు జనవరి 16న సంక్రాంతి పండుగ వస్తుంది. సూర్యుడు ప్రతీ సంవత్సరం మకర సంక్రమణం చేసినప్పుడు 20 నిమిషాలు ఆలస్యం అవుతోంది. స్థూలగణన ఆధారంగా ఇది మూడు సంవత్సరాలకు ఒక గంట, 72 ఏళ్లకు ఒక రోజుగా మారుతోంది.