14-05-2024 RJ
భక్తి
యాదాద్రి, మే 14: విష్ణుమూర్తి యొక్క దశావతారాలలోని 4వ అవతారమే నరసింహస్వామి అవతారం. నృసింహ జయంతి వైశాఖ శుక్ల చతుర్ధతి నాడు జరుపుకొంటారు. నరసింహస్వామి రూపంలో దేహం మానవ రూపం, తల సింహం రూపంలో అవతరించిన దేవుడు.నృసింహస్వామి మాహా శక్తి వంతమైన అవతారంగా చూడాలి. ఇదే రోజున విష్ణుమూర్తి హిరణ్యకశిపుడిని సంహరించి, ధర్మాన్ని నిలబెట్టాడు కాబట్టి నృసింహ జయంతిని వేడుకగా జరుపుకొంటారు. నృసింహ జయంతి వృత్తాంతం ప్రకారం ప్రహ్లాదుడి కోసం ఆయనజన్మించారు. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు.
సాధు పరిరక్షణ కొరకు, దుష్టశిక్షణ కొరకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. వానిలో అతి ముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు. ఈ దశావతారాలలో నాలుగవ అవతారము నారసింహావతారము. మహాలక్ష్మిని సంబోధించే 'శ్రీ' పదాన్ని చేర్చి శ్రీనారసింహుడని ఈ అవతార మూర్తిని స్మరిస్తారు. హిరణ్యకశ్యపుడిని అంతమొందించి, ప్రహ్లాదుడినికాపాడే లక్ష్యంతో ఈ అవతారం ఏర్పడిరది.