ad1
ad1
Card image cap
Tags  

  04-07-2024       RJ

రాష్ట్రానికి ఆర్థిక సాయం చేసి ఆదుకోండి

జాతీయం

  • ఎపికి బడ్జెట్‌లో కేటాయింపులు పెంచండి
  • రాష్ట్ర పునర్మిర్మాణానికి తోడ్పాటు అందించండి
  • విబజన సమస్యలపైనా దృష్టి సారించండి
  • ప్రధాని మోదీ, కేంద్రమంత్రులకు సిఎం చంద్రబాబు వినతి
  • బిజిబిజీగా ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు

న్యూఢిల్లీ, జూలై 4: కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి ఆర్థిక సాయం కోరడంతో పాటు మౌలిక వసతుల కల్పన, అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తి చేయడానికి తోడ్పాటు అందించాలని సిఎం చంద్రబాబు ప్రధాని మోడీని, మంత్రులను కోరారు. అనంతపురం`అమరావతి ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణంతో పాటు, కీలక రహదారుల మరమ్మతులు, పట్టణ, గ్రావిూణ పేదల ఇళ్లు, జల్‌జీవన్‌ మిషన్‌ కింద ఇంటింటికీ తాగునీటి సరఫరా వంటి ముఖ్యమైన అంశాలపై విజ్ఞప్తులు చేశారు. దిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఈనెల చివరి వారంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న వేళ రాష్ట్ర అవసరాలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్టాన్రికి ఆర్థిక సాయం సహా, రాష్ట్ర పునర్‌నిర్మాణానికి అవసరమైన సహకారంపై చర్చించారు. గత ప్రభుత్వం విధ్వంసంతో రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ప్రధాన మంత్రికి నివేదించారు. ప్రధానితో సమావేశానికి ముందు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ను కలిసిన సీఎం.. ఆ తర్వాత మరికొందరు మంత్రులను కలిసి వినతులు సమర్పించారు. కేంద్ర మంత్రులు కె.రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్‌, బీసీ జనార్ధన్‌రెడ్డితో పాటు పలువురు ఎంపీలు చంద్రబాబు వెంట ఉన్నారు.  

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సుమారు అరగంట పాటు సమావేశం జరిగింది. ఏపీకి  సంబంధించిన పలు కీలక అంశాలపై ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది. పోలవరం,అమరావతి నిర్మాణానికి కేంద్ర నుంచి ఆర్థిక సాయాన్ని అందించాలని బాబు కోరినట్లు సమాచారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆయనకు వివరించారు. విభజన హావిూల అమలుతో పాటు పోలవరం నిర్మాణం, మౌలిక వసతుల కల్పన, ప్రాజెక్టుల మంజూరుపై చర్చించారు. అలాగే, కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపు, పారిశ్రామిక రంగాలకు రాయితీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు సహకారం అందించాలని కోరారు. దాదాపు అరగంట పాటు సాగిన సమావేశంలో చంద్రబాబు డిమాండ్లపై ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అంతకు ముందు కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌తో భేటీ అయిన చంద్రబాబు.. వివిధ అంశాలపై మాట్లాడారు. మధ్యాహ్నం కేంద్ర మంత్రులు అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌తో సమావేశం అయ్యారు. సాయంత్రం కేంద్రమంత్రులు మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌, హర్దీప్‌ సింగ్‌ పురీతో భేటీ అవుతారు.

ఇదిలావుంటే సీఎం చంద్రబాబు శుక్రవారం ఉదయం 9 గంటలకు నీతి ఆయోగ్‌ సీఈవో సుబ్రహ్మణ్యం, ఉదయం 10 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఉదయం 10:45 గంటలకు కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, మధ్యాహ్నం 12:30 గంటలకు కేంద్ర మంత్రి అథవాలేతో భేటీ అవుతారు. అనంతరం పలువురు పారిశ్రామికవేత్తలతో పాటు జపాన్‌ రాయబారితో సీఎం భేటీ అవుతారు. సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ చేరుకుంటారు. అటు, తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి సైతం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఆయనతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఇతర కేంద్ర మంత్రులను సైతం కలవనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పెండిరగ్‌ నిధులు సహా విభజన హావిూల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాల్సిందిగా విజ్ఞప్తి చేయనున్నారు. ఈ నెల 6న ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ సందర్భంగా విభజన హావిూలు, పెండిరగ్‌ అంశాలు చర్చించనున్న క్రమంలో ఈ అంశాన్ని కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.

సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వచ్చిన చంద్రబాబు.. శుక్రవారం కూడా పలువురు కేంద్ర పెద్దలను కలిసి ఏపీకి చెందిన అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఏపీ పునర్‌ నిర్మాణం, కేంద్రం మద్దతు సహకారం ఎజెండాగా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన సాగుతోంది. ఇదిలావుంటే విజయవాడ తూర్పు బైపాస్‌ రోడ్డుకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అనుమతి ఇచ్చినట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ వెల్లడిరచారు. రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పలువురు కేంద్రమంత్రులను కలుస్తున్నారు. అందులో భాగంగా కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో భేటీ అయ్యినట్లు ఎంపీ తెలిపారు. చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో రాజధాని అవుటర్‌ రింగ్‌ రోడ్డు సహా ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ నుంచి నిడమానూరు వరకు ఫ్లై ఓవర్‌ ఏర్పాటుకు కేంద్ర మంత్రి పచ్చజెండా ఊపినట్లు ఎంపీ చెప్పారు. వీటంన్నింటిపై త్వరలోనే ఆదేశాలు రానున్నట్లు కేశినేని శివనాథ్‌ చెప్పుకొచ్చారు.

06, Jul 2024

సూరత్‌లో కుప్పకూలిన భవనం.. 15మందికి తీవ్ర గాయాలు

05, Jul 2024

ఢిల్లీలో బిజీబిజీగా సిఎం చంద్రబాబు.. పలువురు కేంద్రమంత్రులతో భేటీ

04, Jul 2024

రాష్ట్రానికి ఆర్థిక సాయం చేసి ఆదుకోండి

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP