06-07-2024 RJ
జాతీయం
గాంధీనగర్, జూలై 6: గుజరాత్ లో పెను ప్రమాదం చోటుచేసుకుంది. సూరత్ పట్టణంలోని సచిన్ పాలీ ప్రాంతంలో ఓ ఆరంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయి ఉండొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న సహాయ బృందాలు.. శిథిలాలు తొలగించే పనిలో నిమగ్నమయ్యాయి. భవనం అప్పటికే శిథిలావస్థకు చేరుకుందని, కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కూలిపోయినట్లు భావిస్తున్నామని అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.