05-07-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, జూలై 5: దిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, జేపీ నడ్డా, నిరమలా సీతరామన్ తదితరులతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై వారితో చర్చించారు. మరో కేంద్రమంత్రి రామ్‌దాస్ అఠావలెతోనూ ఆయన భేటీ అయ్యారు. అనంతరం ఫిక్కీ ఛైర్మన్, ప్రతినిధులను కలుసుకున్నారు. భారత్‌లో జపాన్ రాయబారితో చర్చలు జరపనున్నారు. సాయంత్రం చంద్రబాబు తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు. అంతకు ముందు చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. గత ప్రభుత్వ దుష్పరిపాలన కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తగిన చేయూత ఇవ్వాలన్నారు.