06-11-2023 Super
జాతీయం
- అర్జున రణతుంగ నేతృత్వంలో మధ్యంతర బోర్డు ఏర్పాటు
ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీలో శ్రీలంక క్రికెట్ జట్టు అత్యంత దారుణమైన ప్రతిభను కనబరుస్తోంది. చూసే వాళ్లకే చిరాగ్గా ఉంది.
దీంతో తమ జట్టు ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన శ్రీలంక క్రీడా శాఖ మంత్రి రోషన్ రణసింఘె దిద్దుబాటు చర్యలు చేపట్టారు. మొత్తం క్రికెట్ బోర్డునే తొలగిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేశారు.
మధ్యంతర బోర్డును ఏర్పాటు చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. 1996 వరల్డ్ కప్ గెలిచిన జట్టుకు నేతృత్వం వహించిన అర్జున రణతుంగను ఈ కమిటీకి చైర్మన్ గా నియమించారు. ఈ ప్యానెల్ లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, క్రికెట్ బోర్డు మాజీ ప్రెసిడెంట్ సహా ఏడుగురు సభ్యులను నియమించారు.
ఇండియాతో జరిగిన మ్యాచ్ లో ఘోర వైఫల్యం తర్వాత మంత్రి రోషన్ రణసింఘె క్రికెట్ బోర్డుపై మండిపడ్డారు. శ్రీలంక క్రికెట్ బోర్డ్ అవినీతితో నిండిపోయిందని ఆరోపించారు. బోర్డ్ ప్రెసిడెంట్ తో పాటు సభ్యులకు ఆ పదవుల్లో కొనసాగే అర్హత లేదని విమర్శించారు. వరల్డ్ కప్ టోర్నీలో జట్టు వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.