ad1
ad1
Card image cap
Tags   Sports

  07-11-2023       Super

మాథ్యూస్ టైమ్డ్ అవుట్‌పై విమర్శల వెల్లువ

జాతీయం

జెంటిల్మన్ గేమ్ క్రికెట్‌లో క్రీడాస్ఫూర్తి వెక్కిరించింది. మరోమారు ప్రపంచవ్యాప్తంగా చర్చ మారింది. ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచే ఇందుకు కారణం. శ్రీలంక స్టార్ బ్యాటర్ ఏంజెలో మ్యాథ్యూస్‌ టైమ్డ్ అవుట్‌కు బలయ్యాడు.

దీంతో  ప్రపంచ క్రికెట్ చరిత్రలో అలా అవుటైన తొలి క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 25వ ఓవర్లో మాథ్యూస్ క్రీజులోకి వచ్చాడు. కానీ తన హెల్మెట్ సరిగా లేకపోవడంతో మరో హెల్మెట్ కోసం వేచి చూశాడు. దీంతో నిర్ణీత సమయం మించిపోవడంతో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబల్ హసన్ అంపైర్లకు ఫిర్యాదు చేశాడు.

వారు మాథ్యూస్‌ను టైమ్డ్ అవుట్‌గా ప్రకటించారు.  తాను దేనికోసం వేచి చూశాడో వివరించే ప్రయత్నం చేశాడు మాథ్యూస్. కానీ ఫలితం లేకుండా పోయింది. దీంతో అతడు మౌనంగా వెనుదిరగక తప్పలేదు.  మాథ్యూస్ టైమ్డ్ అవుట్‌పై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్, సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ డేల్ స్టెయిన్ వంటివారు ఈ ఘటనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీ ఘటన దయనీయమైనదని గంభీర్ అన్నాడు. ఇది ఎంతమాత్రమూ సరికాదని డేల్ స్టెయిన్ అభిప్రాయపడ్డాడు. మాథ్యూస్‌ను అవుటిచ్చిన తీరు క్రికెట్ స్పిరిట్‌కు ఎంతమాత్రమూ మంచిది కాదని లంక క్రికెటర్ అసలంక పేర్కొంటే.. ఇది క్రికెట్ స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని పాకిస్థాన్ మాజీ పేసర్ వకార్ యూనిస్ అన్నాడు.

మ్యాథ్యూస్ క్రీజులోనే ఉన్నాడని, అతడి హెల్మెట్ పట్టీ విరిగిపోవడంతో టైమ్డ్ అవుట్ ఎలా ఇస్తారని ఆసీస్ బ్యాటర్ ఉస్మాన్ ఖావాజా ప్రశ్నించాడు. ఇది చాలా హాస్యాస్పదమని అన్నాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం.. వికెట్ పడినప్పుడు తర్వాతి బంతిని ఎదుర్కొనేందుకు బ్యాటర్ రెండు నిమిషాల్లోనే క్రీజులోకి రావాల్సి ఉంటుంది.

లేదంటే టైమ్డ్ అవుట్‌గా ప్రకటిస్తారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటి వరకు ఇలాంటి ఘటన జరగలేదు. అయితే, దేశవాళీ క్రికెట్‌లో మాత్రం ఇలాంటివి ఆరు ఘటనలు ఉన్నాయి. 1997లో కటక్‌లో త్రిపుర-ఒరిస్సా మధ్య జరిగిన మ్యాచ్‌లో హేములాల్ యాదవ్ ఇలాగే టైమ్డ్ అవుట్‌కు గురయ్యాడు.

06, Jul 2024

సూరత్‌లో కుప్పకూలిన భవనం.. 15మందికి తీవ్ర గాయాలు

05, Jul 2024

ఢిల్లీలో బిజీబిజీగా సిఎం చంద్రబాబు.. పలువురు కేంద్రమంత్రులతో భేటీ

04, Jul 2024

రాష్ట్రానికి ఆర్థిక సాయం చేసి ఆదుకోండి

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP