15-11-2023 Super
జాతీయం
అన్నదాతకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ నిధి 15వ విడత డబ్బులు బుధవారం లబ్ధిదారుల ఖాతాల్లో జమ కానున్నాయి. ప్రభుత్వం నవంబర్ 15వ తేదీన డిబిటి ద్వారా అర్హులైన రైతుల ఖాతాలకు వాయిదాలలో రూ.2000 జమ చేయనుంది.
ఈసారి కూడా చాలా మంది అనర్హుల పేర్లను ప్రభుత్వం జాబితా నుంచి తొలగించింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ ట్విట్టర్‌లో 15వ విడతకు సంబంధించిన సమాచారాన్ని అందించారు. డీబీటీ ద్వారా రైతుల ఖాతాల్లోకి వాయిదాల సొమ్మును జమ చేస్తామని చెప్పారు.
ఎవరైతే ఈ-కేవైసీ (eKYC) పూర్తి చేస్తారో వారి ఖాతాల్లోనే రూ.2వేలు జమవుతాయి. ఈ-కేవైసీ పూర్తి చేయని వారికి డబ్బులు అందవు. అందుకే మీ ఈ కేవైసీ పూర్తి చేశారో లేదో తెలుసుకోవాలి. అందుకోసం మొదట https://pmkisan.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.ఆ తర్వాత బెనిఫిషియరీ లిస్ట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. బెనిఫిషియరీ లిస్ట్‌పై క్లిక్ చేస్తే.. మరో పేజీ ఓపెన్ అవుతుంది.
అక్కడ లబ్ధిరుడి రాష్ట్ర, జిల్లా, మండలం, గ్రామాలను ఎంచుకొని..గెట్ రిపోర్ట్‌పై క్లిక్ చేస్తే ఆ గ్రామానికి సంబంధించి లబ్దిదారుల జాబితా కనిపిస్తుంది. ఆ జాబితాలో పేరున్న వారికే పీఎ కిసాన్ కింద రూ.2వేలు అందుతాయి. లిస్ట్‌లో లేని వారికి డబ్బులు రావు. మీకు ఏవైనా సందేశాలున్నా.. ఏదైనా సమాచారం కోసం పీఎం కిసాన్ హెల్ప్‌లైన్ నెంబరుకు సంప్రదించండి.