15-11-2023 Super
జాతీయం
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఓ రోడ్డు ప్రమాదంలో 36 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఆరుమంది పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అత్యవసర వైద్య చికిత్సను అందిస్తోన్నారు.