17-11-2023 Srinu
జాతీయం
చంద్రయాన్-3 లూనార్ మిషన్ ప్రాజెక్టు డైరెక్టర్ ఉదారత
చంద్రయాన్-3 లూనార్ మిషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా వ్యహరించిన వీరముత్తువేల్ తన ఉదారతను చాటుకున్నారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చేపట్టిన చంద్రయాన్-3 శాస్త్రవేతలలో డాక్డర్ పి.వీరముత్తువేల్ ఒకరు. చంద్రయాన్-3 లూనార్ మిషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా వ్యహరించిన ఈ సైంటిస్ట్, తాజాగా తన ఉదారతను చాటుకున్నారు. తాను చదివిన ఇన్‌స్టిట్యూట్ల పూర్వ విద్యార్థుల అసోసియేషన్స్‌కు భారీ విరాళం ప్రకటించారు.
వీరముత్తువేల్ 25లక్షల సాయం..
చంద్రయాన్-3 విజయవంతం కోసం ఎంతో కృషి చేసినందుకు గాను తమిళనాడు ప్రభుత్వం వీరముత్తువేల్‌కు రూ.25 లక్షల రివార్డ్ ప్రకటించింది. వీరముత్తువేల్‌తో పాటు ఆయన టీమ్‌లోని మిగతా ఎనిమిది మంది నగదు బహుమతి అందుకున్నారు. వీరముత్తువేల్ తన రెండు సంవత్సరాల జీతానికి సమానమైన రూ.25 లక్షల రివార్డ్‌ను విరాళంగా ప్రకటించారు. ‘నా మనస్సాక్షి ఈ రివార్డ్‌ను అంగీకరించలేదు. నేను చేసిన పనికి నాకు జీతం వచ్చింది. కాబట్టి, ఈ రివార్డ్‌ను విరాళంగా ఇవ్వడం సరైనదని అనిపించింది.’ అని వీరముత్తువేల్ తెలిపారు.