20-11-2023 Srinu
జాతీయం
ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ - 2023లో ఫైనల్‌లో ఓటమి తర్వాత టీమ్ ఇండియా ఆటగాళ్ల చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే.. ఓటమి తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లారు. ప్రధానమంత్రి భారత ఆటగాళ్లను కలుసుకుని అందరిలో మనోధైర్యాన్ని నింపారు. ఆ సమయంలో మహ్మద్ షమీ చాలా విచారంగా కనిపించాడు. దీంతో ప్రధాని అతడిని కౌగిలించుకుని ఓదార్చారు.