23-11-2023
జాతీయం
తమిళనాడులో కురిసిన భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో వైరల్ ఫీవర్ బారిన పడుతున్న వారు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో, అప్రమత్తమైన అధికారులు ఎక్కడికక్కడ ఫీవర్ క్యాంపులను ఏర్పాటు చేశారు.
కోవిడ్ మాదిరిగానే ఆదేశాలను పాటించాలని జిల్లా అధికారులు కోరారు. ఫ్లూ వైరస్.. పెద్దలను, పిల్లలను ప్రభావితం చేస్తోంది. దీంతో, జ్వర బాధితులు పెరుగుతున్నారు. బాడీ పేయిన్స్, జలుబు, తలనొప్పి, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు రాబోయే కొద్దిరోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. మధుమేహం, అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వంటి వ్యాధులు ఉన్నవారు వెంటనే వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచించారు.
ప్రతీ ఒక్కరూ గోరు వెచ్చటి నీటిని త్రాగాలని అధికారులు. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే పదార్థాలను ఆహారంగా తీసుకోవాలి. కోవిడ్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించారో ఇప్పుడు కూడా అలాంటి జాగ్రత్తలు పాటించాలని ప్రజలను అధికారం యంత్రాంగం కోరింది.