ad1
ad1
Card image cap
Tags   BJP

  15-12-2023       RJ

రాష్ట్రాలను విశ్వాసంలోకి తీసుకోవాలి

జాతీయం

ఇటీవల ఎన్నికల్లో కొన్నిరాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొలవుదీరాయి. అందులో బిజెపి ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ఘడ్ లో బిజెపి ప్రభుత్వాలు కొలువుదీరాయి. తెలంగాలో కాంగ్రెస్ పార్టీ, కర్నాటకలోనే ఆరు నెలల క్రితమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అలాగే మిజోరంలో మిజో పార్టీ అధికారం చేపట్టింది. ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఎవరివైనా కేంద్రం తనవంతు సాయం, మద్దతు కొనసాగించాల్సిందే.

అభివృద్ధి కోసం ఈ రాష్ట్రాలను పట్టుకుని ముందుకు సాగాల్సిందే. అప్పేద దేశం కూడా అభివృద్ధికి బాటలు వేస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సందర్భంగా ప్రధాని మోడీ అభినందనలు తెలుపుతూ కేంద్రం అన్ని విధాల అండగా ఉంటుందని మాటిచ్చారు. నిజానికి అన్ని రాష్ట్రాలకు కేంద్రం అండగా ఉండాలి. అక్కడి ప్రభుత్వాలు ఏ పార్టీవన్నది పక్కన పెట్టి ముందుకు సాగాలి.

రాజకీయాలు వేరు..అభివృద్ధి వేరు.. ఈ రెంటిని అనుసంధానిస్తూ ముందుకు సాగాలి. నీతి ఆయోగ్ ఏర్పాటు సందర్భంగా ప్రధాని మోడీ కూడా కేంద్ర రాష్ట్ర సంబంధాలపై కొత్త నిర్వచనం ఇచ్చారు. కానీ మోడీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాలను విశ్వాసంలోకి తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి.

నిధుల కేటాయింపు మొదలు, అభివృద్ధి పనులు కూడా పరస్పర విశ్వాసంతో కొనసాగించాలి. రాష్ట్రాలు తప్పుదోవ పడుతున్న సందర్భంలో అవసరమైన హెచ్చరికలు కూడా చేయాలి. ఇదే సందర్భం లో తాజాగా మారిన రాజకీయాల క్రమంలో ఆయా రాష్ట్రాల ఆర్థిక స్తితిపైనా హెచ్చరికలు చేయడం మంచిదే.

ఇకపోతే సిఎంలుగా ప్రతి ఒక్కరూ ప్రధానితో నిరంతరం సమీక్షించుకునే అవకాశాలు ఉండాలి. కనీసం ఒక్కో రాష్ట్రానికి ప్రధాని నెలలో ఒకరోజయినా సమయం కేటాయించి రాష్ట్రాల్ర బాగోగులు, సమస్యలు చర్చించాలి. రాష్ట్రాల సమాహారమే దేశం అన్న విషయాన్ని మరవరాదు.

రాష్ట్రాల సమస్యలు పరిష్కరించడంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషఙంచాలి. విద్య, వైద్యం, ఆర్థిక రంగాల్లో నిరంతరంగా చేయూత ఇవ్వాల్సి ఉంటుంది. ధాన్యం సేకరణ, నదీజలాల కేటాయింపు సమస్యలు,విద్యుత్ సమస్యలు, ప్రభుత్వరంగ సంస్థల అమ్మకాలు వంటివి ఏవైనా కేంద్రం కూడా పెద్దతరహాలో రాష్ట్రాలను విశ్వాసంలోకి తీసుకోవాలి. అప్పుడే కేంద్ర రాష్ట్రాల మధ్య బంధం బలోపేతం అవుతుంది.

పార్టీలు వేరయినంత మాత్రాన దేశం వేరు కాదన్న విషయం ఆయా రాష్ట్రాల సీఎంలు కూడా గమనించాలి. అలాగే కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్న అధికారిక సంబంధాలు వేరు. సిఎంలుగా ఎవరైనా ఉండవచ్చు..ప్రధానిగా మరెవ రైనా ఉండవచ్చు.. కానీ వీరి రాజకీయాలకు రాష్ట్రాల అభివృద్ధి బలికావద్దు.

రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎవరైనా కావచ్చు పాలనాపర విషయాల కోసం కేంద్రంతో నిత్యం సంబంధాలు నెరపాల్సిందే. పార్టీలు ఏవైనా అధికారంలో ఉన్నది ఎవరైనా కేంద్రంతో నిరంతరాయంగా అనుసంధానం అవుతూనే ఉండాలి. ఏ ముఖ్యమంత్రి అయినాఢిల్లీ పర్యటనకు వెళ్లడం వంటివి రాజకీయ కోణంలో చూడరాదు. ఫెడరల్ వ్యవస్థలో సిఎంలు ప్రధానిని ,కేంద్ర మంత్రులను, కేంద్ర అధికారులను కలవడం సర్వసాధారణం. ఇది విమర్శించే రాజకీయ పార్టీలు గుర్తించాలి.

తెలంగాణలో ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. సిఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఓ వారం రోజుల క్రితం కొత్త ప్రభుత్వం ఏర్పడింది. మర్యాద పూర్వకంగా సిఎం రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఫోన్ చేసి మద్దతు కోరారు. రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని అన్నారు. ఇందులో కొత్తేమీ లేదు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు అనేకానేక సమస్యలు కేంద్రం వద్ద పెండింలో ఉన్నాయి. విభజన హామీలు అమలు కాలేదు.

రోడ్ల విస్తరణ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. వీటిని ఆపడం వల్ల నష్టపోతున్నది ప్రజలే అని బిజెపి నేతలు గుర్తించాలి. కేంద్రంలో అధికారం లేకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చొరవ తీసుకున్న కాంగ్రెస్ పార్టీ నిస్సహాయంగా నిలబడింది. ఇకపోతే పలు పెండింగ్ ప్రాజెక్టులు, జిఎస్టీ నిధుల విడుదలకు సంబంధించి కేంద్రంతో సమస్యలు ఉండనే ఉన్నాయి.

ఇవన్నీ కూడా పరిష్కరించుకోవడం సిఎంగా రేవంత్ రెడ్డి తక్షణ కర్తవ్యం. ఇవన్నీ చక్కబెట్టుకోవడం కోసం ఢిల్లీకి వెళ్లాల్సిందే. కేంద్ర రాష్ట్ర సంబంధాలు వేరు.. రాజకీయ పోరాటాలు వేరని గుర్తించాలి. రాష్ట్రాలకు సంబంధించి అనేక సమస్యలను ఎప్పుడూ నిలదీయడంలోనూ వెనకడుగు వేయరాదు. గత పదేళ్లుగా తెలంగాణ విషయంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ముఖ్యంగా మోడీ ఎందుకనో నిర్లక్ష్యంగా ఉన్నారు.

అనేకానేక సమస్యలను పట్టించు కోవడం లేదు. అందువల్ల రాజకీయ విభేదాలను కట్టిపెట్టాలి. అభివృద్ధికి సంబంధించి రాష్ట్రాలతో కలసి చర్చించాలి. అప్పుడే పటిష్టమైన దేశంగా అభివృద్ధి సాధించగలదు. అందుకు మోడీ అడుగులు వేయాలి. అప్పుడే దేశం యావత్తూ హర్షిస్తుంది. బిజెపి ఇతర ప్రభుత్వాలను కూడా విశ్వాసంలోకి తీసుకుంటేనే అర్థం ఉంటుంది.

06, Jul 2024

సూరత్‌లో కుప్పకూలిన భవనం.. 15మందికి తీవ్ర గాయాలు

05, Jul 2024

ఢిల్లీలో బిజీబిజీగా సిఎం చంద్రబాబు.. పలువురు కేంద్రమంత్రులతో భేటీ

04, Jul 2024

రాష్ట్రానికి ఆర్థిక సాయం చేసి ఆదుకోండి

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP