15-12-2023 RJ
జాతీయం
జైపుర్, (డిసెంబర్15): రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తదితర బీజేపీ అగ్రనేతల సమక్షంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. బీజేపీ శాసన సభాపక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రులు దియా కుమారి, ప్రేమ్ చంద్ బైర్వా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. భజన్ లాల్ ఆరెస్సెఎన్ మనిషి. ఏబీవీపీ, బీజేవైఎంలో పనిచేశారు.
భరత్ పూర్ జిల్లా అటారీకి చెందిన ఈయన రెండుసార్లు నర్పంచ్ గా పనిచేశారు. నాలుగుసార్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 1992లో అయోధ్య రామమందిర ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లారు. కాగా, ఈ ఎన్నికల్లో సొంత ప్రాంతం వదిలి.. దాదాపు 200 కిలోమీటర్ల దూరంలోని సంగనేర్ నుంచి పోటీ చేశారు.
తాను పొలిటికల్ సైన్స్ లో ఎంఏ చేశానని ఎన్నికల అఫిడవిట్ లో భజన్ లాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాపారాన్ని నడుపుతున్నారు. నవంబర్ 25న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 115 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 69 సీట్లు సాధించింది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి ఎకాఎకిన సీఎం పీఠాన్ని చేపట్టిన ఘనత భజన్ లాల్ శర్మకు దక్కుతుంది.
రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రిగా ఆయన శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. జైపూర్ లోని రామ్ నివాన్ బాగ్ లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఆయన చేత గవర్నర్ కల్ రాజ్ మిశ్రా ప్రమాణస్వీకారం చేయించారు. బీజేపీ నేతలు దియా కుమారి, ప్రేమ్ చంద్ భైర్వా ప్రమాణ స్వీకారం చేశారు.
భరతపూర్ లోని అటారీ గ్రామానికి చెందిన రైతు కుటుంబంలో భజన్ లాల్ (56) జన్మించారు. తన సొంత తహసిల్ నద్బయిలోని ప్రభుత్వ పాఠశాలలోనే ఆయన చదువుకున్నారు. 1989లో మహారాణి శ్రీ జయ ప్రభుత్వ కాలేజీలో బీఏ పూర్తి చేశారు. కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే ఆయన బీజేపీ యువజన విభాగమైన ఏబీవీపీలో చేరారు. భరత్పూర్ జిల్లా కో-కన్వీనర్ గా కూడా సేవలందించారు. 1994లో 27 ఏళ్ల వయస్సులోనే ఆయన అటారి గ్రామ సర్పంచ్ అయ్యారు.
రెండు సార్లు ఇదే పదవిలో కొనసాగారు. ఆ తర్వాత కూడా పార్టీలో వివిధ పదవుల్లో పనిచేశారు. మండల అధ్యక్షుడిగా, రెండు మూడు సార్లు రాష్ట్ర బీజేపీ కార్యదర్శిగా సేవలు అందించారు. దియాకుమారి: జైపూర్ ను పాలించిన చిట్టచివరి మహారాజు మాన్ సింగ్ - 2 మనుమరాలు. 2013లో బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. 2013లో నవాయ్ మధోపూర్ నుంచి రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నిక కావడంతో ఆమె రాజకీయ జర్నీ విజయవంతంగా మొదలైంది. 2019 లోక్సభ ఎన్నికల్లో ఆమె తన సమీప కాంగ్రెన్ ప్రత్యర్థి దేవకినందన్ కాకాపై 5,51,916 ఓట్ల భారీ ఆధిక్యంతో అఖండ విజయం సాధించింది.
దీంతో ఆమె పార్లమెంటు సభ్యురాలిగా జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రేమ్ చంద్ భైర్వా: డుడు విధాన్ సభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా 54 ఏళ్ల ప్రేమ్ చంద్ భైర్వా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి బాబూలాల్ నగర్పై 35,743 ఓట్ల ఆధిక్యంతో ఆయన విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి భైర్వా ఓటమిని చవిచూశారు. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి బాబూ లాల్ నగర్ 14,799 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.