16-12-2023 RJ
జాతీయం
అయోధ్య, (డిసెంబర్ 16): శ్రీరామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా అయోధ్యకు వెయ్యికి పైగా ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆలయ నిర్మాణం పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో గుడికి సంబంధించి పలు చిత్రాలను విడుదల చేసింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్?. ఆలయం ఓపెనింగ్? కు ఇంకా కొద్దిరోజులే సమయం మిగిలి ఉండటం వల్ల దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నారు అధికారులు.
ఇప్పటికే సింహభాగం పనులు పూర్తవ్వగా మిగిలిన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ డిసెంబర్ చివరికల్లా అవి కూడా పూర్తవుతాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. 2024 జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయిన తర్వాత జనవరి 23 నుంచి సాధారణ భక్తులకూ శ్రీరాముడి దర్శన భాగ్యం కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో అయోధ్యకు తరలివచ్చే అవకాశం ఉంది.
ఈ రద్దీని దృష్టిలో ఉంచుకొనే రైల్వే శాఖ వెయ్యికి పైగా రైళ్లను నడిపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆలయ ప్రారంభం నాటి నుంచి తొలి వంద రోజుల వరకు ఈ రైళ్లు తిరిగే అవకాశం ఉంది. కాగా, వచ్చే ఏడాది జనవరి 19 నుంచి ఈ స్పెషల్? ట్రైన్స్? ను నడపాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఈ 100 రోజుల్లో ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, పుణె, కోల్ కతా, నాగ్ పుర్?, లక్నౌ, జమ్మూ సహా దేశవ్యాప్తంగా ఉన్న పలు నగరాల నుంచి ఈ స్పెషల్ సర్వీసులను అందుబాటులోకి తేనున్నట్లు రైల్వే అధికారులు చెప్పారు.
డిమాండ్ ఆధారంగా ఈ రైళ్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు కొన్ని రైళ్లను ప్రత్యేకంగా భక్తుల కోసం రిజర్వ్ చేసి ఛార్టెర్డ్ సర్వీసులు కూడా అందించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని అయోధ్యలోని రైల్వే స్టేషన్లో ఆధునికీకరణ పనులను ప్రారంభిస్తున్నారు అధికారులు.
ప్రతిరోజు 50వేల మంది ప్రయాణికులు రైళ్ల ద్వారా రాకపోకలు సాగించేలా అన్ని రకాల సదుపాయాలను అందుబాటులోకి తెస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 15 నాటికి అయోధ్య రైల్వే స్టేషన్ పనులు పూర్తి కానున్నాయి. మరోవైపు రామమందిర నిర్మాణానికి సంబంధించిన తాజా చిత్రాలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విడుదల చేసింది. దీంతో ఆలయ నిర్మాణ పనులు ఎక్కడివరకు వచ్చాయో అంచనా వేయవచ్చని పేర్కొంది ట్రస్ట్?.
అయోధ్య శ్రీరాముడి మందిర ప్రారంభోత్సవానికి ఇప్పటికే ముహూర్తం ఖరారైంది. 2024 జనవరి 22న గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. రోజుల పాటు ఈ ప్రాణ ప్రతిష్ఠ' కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆలయ ట్రస్టు నిర్ణయించింది. ఈ మహత్కార్యానికి ప్రధాని మోదీతో పాటు 4వేల మంది సాధువులు, వివిధ రంగాలకు చెందిన 2,500 మంది వరకు ప్రముఖులు రానున్నారు.