16-12-2023 RJ
జాతీయం
కేరళ, (డిసెంబర్ 16): దేశంలో మరోసారి కోవిడ్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా కేరళలో కొత్తగా కోవిడ్ సబ్‌వేరియంట్ వెలుగులోకి వచ్చింది. జేఎన్1 సబ్‌వేరియంట్ ని కనుగొన్నారు. చైనాలో కేసులకు కారణమవుతున్న ఈ వేరియంట్‌ని తొలిసారిగా కేరళలో గుర్తించారు. ఈ JN.1 అనేది BA.2.86 సబ్ వేరియంట్ గా కూడా పిలుస్తారు. మొదటిసారిగా సెప్టెంబర్ 2023లో అమెరికాలతో ఇది కనుగొనబడింది. ప్రస్తుతం ఈ కొత్త వేరియంట్ గుర్తించడంతో దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన పెరుగుతోంది. BA.2.86కి 19 సబ్-వేరియంట్ 1 కేసు డిసెంబర్ 8న కేరళలో కనుగొనబడింది.
79 ఏళ్ల మహిళ శాంపిళ్లను పరీక్షించగా ఈ కొత్త వేరియంట్ ఉన్నట్లు గుర్తించారు. ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందడంతో పాటు మానవుడి రోగ నిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇంతకముందు సింగపూర్ దేశంలో ఒక భారతీయ టూరిస్ట్ కి కూడా సబ్-వేరియంట్ ఉన్నట్లు గుర్తించారు. తమిళనాడు తిరుచిరాపల్లి జిల్లాకు చెందిన వ్యక్తిలో దీన్ని కనుగొన్నారు. ఆ తర్వాత దేశంలో మరెక్కడా కూడా ఈ వేరియంట్ కనిపించలేదు. తాజాగా కేరళలో వెలుగులోకి రావడంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది.
కోవిడ్-19 వేరియంట్ BA.2.86కి .1 సబ్ వేరియంట్. ఈ వేరియంట్ ద్వారా ఇప్పటి వరకు ఆస్పత్రిలో చేరడం, తీవ్రమైన అనారోగ్యానికి గురికాలేదని, అరోరా చెప్పారు. దాదాపుగా ఏడు నెలల అనంతరం భారత్‌లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాం. ఇప్పటికే పలు పాశ్చాత్య దేశాల్లో వ్యాప్తి పెరుగుతోంది.