17-12-2023 RJ
జాతీయం
నాగ్‌పూర్, (డిసెంబర్ 17): మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని బజార్‌గావ్ ప్రాంతంలో ఉన్న సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ లో ఆదివారం ఉదయం దాదాపు 9.30 గంటలకు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా తీవ్రంగా గాయపడిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ప్రమాద సమయంలో 12 మంది మాత్రమే ఫ్యాక్టరీలో ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసు బృందం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. బొగ్గు బ్లాస్టింగ్ కోసం సోలార్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలోని కాస్ట్ బూస్టర్ ప్లాంట్‌లో పేలుడు పదార్థాలను ప్యాకింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
దేశం రక్షణ విభాగానికి పేలుడు పదార్థాలు, ఇతర రక్షణ పరికరాలు సరఫరా చేయడంలో కంపెనీ కీలకంగా వ్యవహరిస్తుంది. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలిసేది ఉందని నాగ్‌పూర్ పోలీసు సూపరింటెండెంట్ హర్ష్ పొద్దార్ తెలిపారు.