ad1
ad1
Card image cap
Tags   New Delhi

  19-12-2023       RJ

పార్లమెంట్లో ప్రజాస్వామ్యం ఖూనీ !

జాతీయం

పార్లమెంటులో ఏ విషయంలో అయినా చర్చ అన్నది కానరావడం లేదు. ప్రభుత్వం ఏది కోరుకుంటుందో అదే చర్చించాలన్న ధోరణి మరింత పెరిగింది. పాలకుల అహంకారానికి ఇది పరాకాష్టగా చూడాలి. పార్లమెంట్ ఉన్నదే చర్చించడానికి. జవాబుదారీతనం కోసం. ఈ రెండూ లేకుండా మనం నిరంకుశ విధానంలో లేము. మనది చైనా తరహా పాలన కాదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో సమస్యలను లేవనెత్తే విషయంలోనూ.. అధికార పక్షాన్ని నిలదీసే హక్కు విపక్షాలకు ఉంటుంది. అది లేనప్పుడు పార్లమెంటు ఎందుకు అన్నదే సమస్య.

ప్రజల సమస్యలు చర్చించడం లేదు. ప్రతిపక్షాలు అడిగిన దానికి సమాధానం చెప్పరు. ఇకపోతే ఈ మధ్య కాలంలో సమావేశాలు ఎప్పుడు జరిగినా అర్థవంతంమైన చర్చ జరగలేదు. విపక్షాలను విశ్వాసంలోకి తీసుకునే అలవాటు లేకుండా పోయింది. గత పదేళ్లుగా ఇదే తంతు జరుగుతోంది. సమస్య ఏదైనా చర్చ అన్నది లేకుండా చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీలో ఇదే జరిగేది. అందుకే కెసిఆర్ అహంకారానికి ప్రజలు పాతరేశారు. ప్రజాస్వామ్యంలో మనకు తిరుగులేదన్న ఏ నాయకుడినీ ప్రజలు వదల లేదు.

నేను అన్నీ మంచి పనులే చేస్తున్నానని అనుకోవడం మూర్ఖత్వం తప్ప మరోటి కాదు. పార్లమెంటు గత సమావేశాలు కూడా ఇలాగే ముగించేశారు. చర్చకు ఆస్కారం ఇవ్వడం లేదు. తాజాగా అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఈ నెల 4న మొదలైన సమావేశాల్లో ఒక్కటంటే ఒక్క సమస్య చర్చకు రాలేదు. మోడీ అధికారం చేపట్టిన తరువాత పార్లమెంటులో చర్చలు... సమాధానాలు అన్న సంప్రదాయం మంట కలిసింది. నిరంకుశ పోకడలకు ప్రస్తుత ఘటనలు ఉదాహరణగా చూడాలి. తాజాగా లోక్ సభలో స్మోక్ బాంబు పై ప్రకటన చేయాలని డిమాండ్ చేయడం వివక్షాల తప్పయినట్లుగా ప్రభుత్వం తీరు ఉంది. పార్లమెంట్ లో భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయాలని డిమాండ్ చేసినందుకు పార్లమెంట్ ఉభయ సభల్లో ఏకంగా 78 మంది ఎంవీలపై సోమవారం సస్పెన్షన్ వేటు పడింది.

లోక్ సభలో 30 మంది సభ్యులను ఈ సెషన్లో మిగిలిన రోజులకు.. ముగ్గురిని సభా హక్కుల కమిటీ ఇవేదిక సమర్పించేంతవరకూ సస్పెండ్ చేశారు. రాజ్యసభలో 35 మందిని సెక్షన్లో మిగిలిన రోజులకు..11 మందిని సభా హక్కుల కమిటీ నివేదిక సమర్పించేంతవరకూ సస్పెండ్ చేశారు. ఇదే అంశంపై గత వారం సస్పెండైన 14 మందితో కలిపి.. ఈ సెషన్లో మొత్తం 92 మంది ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేసినట్లయింది. లోక్ సభ నుంచి సస్పెండైన ఎంపీల్లో కాంగ్రెస్ సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌధురి, డిప్యూటీ నేత గౌరవ్ గొగోయ్, తృణమూల్ ఎంవీలు కల్యాణ్ బెనర్జీ, కాకోలీ ఘోష్ దస్తీదార్, సౌగత్ రాయ్, శతాబ్ది రాయ్, డీఎంకేసభ్యులు ఎ. రాజా, దయానిధి మారన్ తదితరులున్నారు. రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యులు జైరాం రమేశ్, రణదీప్ సింగ్ సూర్జేవాలా, డీఎంకే ఎంవీలు కనిమొళి, ఆర్జేడీ సభ్యుడు మనోజ్ కుమార్ ఝా తదితరులున్నారు.

ఇంత నిరంకుశంగా పార్లమెంట్ సమావేశాలు జరగాలని అనుకున్నప్పుడు సమావేశాలు నిర్వహించడమే దండగ. విపక్షాలను మొత్తంగా పార్లమెంటుకు రాకుండా సర్క్యులర్ జారీచేసి సమావేశాలను ఇన్హహౌజ్ లో జరుపుకోవచ్చు. ఇకపోతే జర్నలిస్టులను కూడా పార్లమెంట్ సమావేశాలకు కట్టడి చేయడం దారుణం కాక మరోటి కాదు. 1989లో రాజీవ్ గాంధీ హయాంలో 63 మందిని సస్పెండ్ చేశారు. అప్పట్లో.. వారంలో మిగిలిన మూడు రోజులకే సస్పెన్షన్ వర్తింపజేయగా, ఇప్పుడు సెషన్ నుంచే సస్పెండ్ చేశారు.

పార్లమెంట్ చరిత్రలో ఒక సెషన్ లో ఇంతమందిని సస్పెండ్ చేయడం ఇదే మొదటిసారి. ఇలా చేయడం వల్ల పార్లమెంట్ ఏక ఛత్రాధిపత్యంలోకి వెళ్లిందని భావించాలి. ఎంపిలను సస్పెండ్ చేసి ఏం చేద్దామనుకుంటున్నారో చెప్పాలి. హోంమత్రిని ప్రకటన చేయాలని కోరడం తప్పెలా అవుతుందో చెప్పాలి. సోమవారం పార్లమెంట్ సమావేశం కాగానే ఉభయ సభలూ ప్రతిపక్ష సభ్యుల నినాదాలతో దద్దరిల్లాయి. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో లోక్ సభ దద్దరిల్లింది.

టీవీల్లో కాదు సభకు వచ్చి మాట్లాడ అని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. పార్లమెంటులో భద్రతా వైఫల్యం, మణిపూర్ పరిస్థితులపై చర్చకు ఉభయ సభల్లోనూ ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసులను సభాపతులు తిరస్కరించారు. గందరగోళం మధ్యనే కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ టెలీకమ్యూనికేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. ఆ తర్వాత స్పీకర్ ఓం బిర్లా.. సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత 2.45 వరకు వాయిదా వేసి 'పోస్టాఫీసు బిల్లు, 2023'ను ఆమోదించి వెంటనే 3 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదురితో సహా 30 మంది ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

తీవ్ర గందరగోళం మధ్య ఆయన 3.20 గంటలకు సభను మంగళవారానికి వాయిదా వేశారు. రాజ్యసభ కూడా 11.30 గంటలకు, 2గంటలకు, 4గంటలకు, 4.30 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత.. 35 మంది ప్రతిపక్ష సభ్యులను శీతాకాల సమావేశాలు పూర్తయ్యే వరకూ సస్పెండ్ చేస్తున్నట్లు చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ ప్రకటించారు. 11 మంది రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్ను సభా హక్కుల కమిటీకి నివేదిస్తున్నట్లు తెలిపారు.

సస్పెండైన ఎంపీలు సభను విడిచి వెళ్లాలని చైర్మన్ ఆదేశించారు. అయినా వారు పట్టించుకోకపోవడంతో సభను మంగళవారానికి వాయిదా వేశారు. బిల్లులు ఆమోదించుకోవడమే పని అయితే తలుపులు వేసుకుని ఆమోదించవచ్చు. టీవీలను కట్టేసి చర్చించుకోవచ్చు. కేవలం అధికారపక్షం, వత్తాసు పలికే పక్షం ఉంటే సరిపోతుంది. ఈనెల 3న లోక్సభలోకి చొరబడ్డవారికి పాన్లు ఇచ్చిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహపై ఎలాంటి చర్యలూ తీసుకోకుండా.. హోం మంత్రి ప్రకటన కోరిన తమను సస్పెండ్ చేయడంపై విపక్ష సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్షాలు లేని పార్లమెంట్లో మోదీ సర్కారు కీలక చట్టాలను ఎలాంటి చర్చా లేకుండా ఇష్టం వచ్చినట్లు ఆమోదించుకోవడం నిరంకుశానికి పరాకాష్ట.

ఎంపీలను సస్పెండ్ చేయడం ద్వారా మొత్తం ప్రజాస్వామిక సంప్రదాయాలను మోదీ ప్రభుత్వం తుంగలో తొక్కింది. ఇలా ప్రభుత్వ నియంతృత్వం పరాకాష్టకు చేరింది. పార్లమెంట్ ను బీజేపీ కేంద్ర కార్యాలయంగా భావిస్తోందా అన్న అనుమానాలు మరింతగా బలపడ్డాయి. పార్టీలోనూ, పార్లమెంట్లోనూ తన పెత్తనమే అన్నట్లుగా మోడీ పాలన సాగుతోంది. విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం సరైందేనని బీజేపీ వ్యాఖ్యానించి తన పరువును పోగట్టుకుంది.

06, Jul 2024

సూరత్‌లో కుప్పకూలిన భవనం.. 15మందికి తీవ్ర గాయాలు

05, Jul 2024

ఢిల్లీలో బిజీబిజీగా సిఎం చంద్రబాబు.. పలువురు కేంద్రమంత్రులతో భేటీ

04, Jul 2024

రాష్ట్రానికి ఆర్థిక సాయం చేసి ఆదుకోండి

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP