19-12-2023 RJ
జాతీయం
ఛత్తీస్గఢ్, (డిసెంబర్ 19): అసెంబ్లీ స్పీకర్ గా మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ నియామకమయ్యారు. రమణ్ సింగ్ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రొటెం స్పీకర్ రాంవిచార్ నేతమ్ సభలో ప్రకటించారు. ప్రొటెం స్పీకర్ విజ్ఞప్తి మేరకు సీఎం విష్ణుదేవ్ సాయి, ప్రతిపక్షనేత చరదాస్ మహంత కలిసి రమణ్ సింగ్ ను స్పీకర్ చైర్ వరకు తీసుకువెళ్లి కూర్చుండబెట్టారు. అనంతరం సీఎం, పొట్రెం స్పీకర్, ప్రతిపక్షతో పాటు మాజీ సీఎం భూపేశ్ బఘేల్ సహా సీనియర్ నేతలంతా రమణ్ సింగ్ కు అభినందనలు తెలిపారు.
15 ఏళ్ల పాలన, సమర్థవంతమైన నాయకుడంటూ నేతలు కొనియాడారు. ఈ సందర్భంగా స్పీకర్ రమణ్ సింగ్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తాను కొత్త పాత్ర పోషిస్తున్నానన్నారు.
నా కొత్త బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ.. రాష్ట్ర అసెంబ్లీని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని చెప్పారు. రమణ్ సింగ్ అసెంబ్లీ స్పీకర్ పదవికి నామినేషన్ వేసే ముందు భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపారు. స్పీకర్ పదవి నామినేషన్ వేసినందున పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.