ad1
ad1
Card image cap
Tags   New Delhi

  19-12-2023       RJ

గందరగోళం మధ్య ఉభయ సభలు వాయిదా..49మంది ఎంపిలపై వేటు

జాతీయం

న్యూఢిల్లీ, (డిసెంబర్ 19): పార్లమెంట్లో బహిష్కరణల పర్వం కొనసాగింది. మంగళవారం మరికొంతమంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. మరోవైపు పార్లమెంట్ లో విపక్షాల నిరసనలతో గందరగోళం నెలకొంది. ఈ నెల 13న లోక్ సభలో ఆగంతుకుల చొరబాటుకు సంబంధించి భద్రతా వైఫల్యంపై హోం మంత్రి ప్రకటన చేయాలంటూ విపక్ష ఎంపీలు పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. మంగళవారం మరో 49 మంది ఎంపీలపై వేటు పడింది.

సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారని స్పీకర్ విపక్ష ఎంపీలపై వేటు వేశారు. ఈ మేరకు సభాపతి ఆదేశాలు ధిక్కరించిన సభ్యుల సస్పెన్షన్ కు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మూజువాణీ ఓటుతో లోక్ సభ ఆమోదించింది. అనంతరం స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఎంపీలు సుప్రియా సూలే, ఫరూఖ్ అబ్దుల్లా, శశిథరూర్, మనీష్ తివారీ, కార్తి చిదంబరం, డింపుల్ యాదవ్, డానిష్ అలీ సస్పెండైన వారిలో ఉన్నారు.

ఈ సమావేశాల మొత్తానికి వారిని సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. విపక్షాల ఆందోళన నేపథ్యంలో మంగళవారం కూడా ఉభయ సభలు స్తంభించాయి. లోక్ సభలో భద్రతా వైఫల్యం ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని, విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ సైతం ఎత్తేయాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. స్పీకర్ వెల్ లోకి వెళ్లి మరీ నినాదాలు చేశారు. దీంతో ఉభయసభలు వాయిదా పడ్డాయి.

అటు, సస్పెన్షన్ కు గురైన ఎంపీలు అడిగిన 27 ప్రశ్నలను లోక్ సభ ప్రశ్నల జాబితా నుంచి తొలగించారు. కాగా, లోక్ సభలో గత వారం 13 మందిని, సోమవారం మరో 33 మందిని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తాజా సంఖ్యతో కలిపి ఇప్పటి వరకూ లోక్ సభలో 95 మంది ఎంపీలపై వేటు పడింది. అటు, రాజ్యసభలోనూ ఇప్పటివరకూ 46 మంది సస్పెండ్ అయ్యారు. దీంతో ఈ శీతాకాల సమావేశాల్లో మొత్తం 141 మంది విపక్ష ఎంపీలపై వేటు పడిన్లటైంది.

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 22 శుక్రవారంతో ముగియనున్నాయి. దీంతో బహిష్కృత ఎంపిలు పార్లమెంట్ బయట ధర్నా నిర్వహించారు. మాక్ పార్లమెంట్ నిర్వహించి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ నెల 13న గుర్తు తెలియని వ్యక్తి లోక్ సభలో ప్రవేశించి హల్ చల్ చేశాడు. గ్యాలరీలో నుంచి సభలోకి దూసుకొచ్చి టియర్ గ్యాస్ వదిలాడు. దీంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది.

ఈ క్రమంలో భయంతో ఎంపీలు పరుగులు పెట్టారు. ఆ రోజు స్పీకర్ వెంటనే సభను వాయిదా వేశారు. జీరో అవర్ లో ఈ ఘటన జరగ్గా అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఇద్దరు ఆగంతుకులను పట్టుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో పార్లమెంట్ లో భద్రతా వైఫల్యంపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే, ఘటనకు సంబంధించి పోలీసులు కీలక నిందితులను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో దాడి తర్వాత ప్రారంభమైన సమావేశాల్లో విపక్ష సభ్యులు పార్లమెంట్ భద్రతా వైఫల్యం ఆందోళన కొనసాగిం చారు.

దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలంటూ పట్టుబట్టారు. ఈ క్రమంలో ఎంపీలపై క్రమశిక్షణా చర్యలు చేపడుతూ స్పీకర్, చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ సెషన్ లో ఇప్పటివరకు మొత్తంగా 141 మంది ఎంపీలపై వేటు పడింది. పార్లమెంట్ భద్రతా వైఫల్యం అంశంపై సభలో గందరగోళం సృష్టించడంతో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సస్పెండ్ అయిన ఎంపీల్లో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ అధిర్ రంజన్ చౌదరి, డీఎంకే ఎంపీలు టీఆర్ బాలు, దయానిధి మారన్, టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ తదితరులు ఉన్నారు.

పార్లమెంటు చరిత్రలోనే 141 మంది ఎంపీలపై ఉభయసభల్లో సస్పెన్షన్ వేటు పడటంతో విపక్ష ఎంపీలు మంగళవారంనాడు నిరసనకు దిగారు. కొత్త పార్లమెంటు భవనం మకర్ ద్వార్ వెలుపల మెట్లపై 'మాక్ పార్లమెంటు' నిర్వహించారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ మరో అడుగు ముందుకు వేసి ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్పర్సన్ జగ్దేదీప్ ధన్డ్ ను అనుకరిస్తూ 'పేరడీ' చేశారు. సభ్యులు నవ్వులతో ఘల్లుమనడం, రాహుల్ గాంధీ తన మొబైల్ కెమెరాలో దానిని షూట్ చేయడం హాటాపిక్ గా మారింది.

మాక్ పార్లమెంటులో ఎంపీలు తనను అనుసరిస్తూ పేరడీ చేయడంపై ఉపరాష్ట్రపతి ధనాడ్ మండిపడ్డారు. ఇది సిగ్గుచేటు.. ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వీడియోలో కల్యాణ్ బెనర్జీ నా వెన్నెముక నిటారుగా ఉంటుంది. నేను చాలా పొడగరిని అంటూ ధన్డ్ తరహాలో అభినయించినట్టు కనిపిస్తోంది. ఎంపీల సస్పెన్సన్ అనంతరం తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు రాజ్యసభ సమావేశం కాగానే జర్దీప్ ధనఖడ్ పరోక్షంగా రాహుల్ను ఉద్దేశిస్తూ... చైర్మన్ పదవి, స్పీకర్ పదవి రెండింటికీ చాలా వైరుధ్యం ఉంది.

రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరిపై ఒకరు విసుర్లు విసురుకోవచ్చు. కానీ, మీ పార్టీకి చెందిన ఒక సీనియర్ నేత, మరో పార్టీకి చెందిన వ్యక్తిని వీడియో తీస్తున్నారని అన్నారు. సస్పెండైన విపక్ష ఎంపీలు జర్దీప్ ధన్డ్ను అనుసరిస్తూ చేసిన పేరడీ వీడియోను బీజేపీ షేర్ చేసింది. ఉపరాష్ట్రపతిని బెనర్జీ, రాహుల్ పరిహసించారంటూ మండిపడింది. విపక్ష ఎంపీలను ఎందుకు సస్పెండ్ చేశారని దేశం ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే.. దానికి ఈ వీడియోనే సమాధానం. ఉపరాష్ట్రపతిని తృణమూల్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ గేళి చేస్తున్నారు. ఇదిచూసి రాహుల్ గాంధీ చిరునవ్వులు నవ్వుతున్నారు. దీనిని బట్టే వీరు సభలో ఎంత నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతుంటారో ఎవరికి వారే ఊహించుకోవచ్చు అని ఆ ట్వీట్లో బీజేపీ పేర్కొంది.

06, Jul 2024

సూరత్‌లో కుప్పకూలిన భవనం.. 15మందికి తీవ్ర గాయాలు

05, Jul 2024

ఢిల్లీలో బిజీబిజీగా సిఎం చంద్రబాబు.. పలువురు కేంద్రమంత్రులతో భేటీ

04, Jul 2024

రాష్ట్రానికి ఆర్థిక సాయం చేసి ఆదుకోండి

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP