ad1
ad1
Card image cap
Tags  

  21-12-2023      

కరోనా డేంజర్ బెల్స్..మళ్లీ మొదలు

జాతీయం

అస్సాం, (డిసెంబర్ 21): గత 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 614 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తున్నది. ఈ ఏడాది మే 21 తర్వాత ఇంత అధిక స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం. దీంతో దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 2,311కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. కొవిడ్-19 ఉప రకం జేఎన్.1కు సంబంధించి మూడు రాష్ట్రాల్లో 21 కేసులు నమోదయ్యాయి. గోవాలో 19, మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి.

ఈ ఉప వేరియంట్ వ్యాప్తికి గల కారణాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో కరోనా కారణంగా కేరళలో మూడు మరణాలు నమోదయ్యాయి. దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రజలంతా మళ్లీ అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరిస్తోంది. కేంద్రం సూచనలతో రాష్ట్రాలు కూడా అప్రమత్తం అయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ ఇప్పటికే ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

కరోనా పూర్తిగా నాశనం కాలేదని,ఇటీవల కాలంలో కొత్త వేరియంట్ వెలుగు చూస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, జార్ఖండ్, కర్ణాటక రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు పెరిగిందని చెప్పారు. కరోనా వ్యాధి సన్నద్ధత, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు తదితర అంశాలను ఆయన వివిధ రాష్ట్రాలతో చర్చించారు. కేసుల పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయినా అప్రమత్తత అవసరమని కేంద్రం తెలిపింది. కేసులపై నిఘా పెంచాలని, అప్ర మత్తంగా ఉండాలని, అవసరమైన మందులను తగిన స్థాయిలో నిల్వ ఉంచాలని, ఆక్సిజన్, కాన్సంట్రేటర్లు, వెంటిలేటర్లు, వ్యాక్సిన్లు సిద్ధంగా ఉంచుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించారు.

పనితీరును పరిశీలించేందుకు కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ప్రతి మూడు నెలలకోసారి ఆసుపత్రులలో సన్నద్ధత పై మాక్రాల్ నిర్వహించాలని ఆదేశించారు. అలాగే టెస్టుల సంఖ్యను పెంచాలని, తాజా కేసులు, టెస్టులు, పాజిటివిటీకి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు కేంద్రంతో పంచుకోవాలని కేంద్ర మంత్రి మాండవీయ కోరారు. నిజానికి గతేడాది చైనాలో జీరో కొవిడ్ పాలసీ ఎత్తేశాక వైరస్ కేసులు రోజురోజుకూ పెరిగాయి. మరణాలూ పెద్ద సంఖ్యలోనే నమోదవుతున్నా.. ప్రభుత్వం అధికారికంగా వెల్లడించడంలేదు.

మరణాలను పట్టించుకోవడం లేదు. అలాగే మరణాలను ప్రపంచానికి తెలియనివ్వ లేదు. చైనా సహా పలు దేశాల్లో కొవిడ్ ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఆనాటినుంచే భారత్ అప్రమత్తమైంది. మరోవైపు కరోనా పూర్తిగా అంతం కాలేదని కొత్త వేరియంట్లు వస్తున్నాయని గతంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక చేసింది. అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరించింది. కరోనాతో జాగ్రత్తగా ఉండాల్సిందేనని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియచేసింది.

రాబోయే రోజుల్లో కరోనా వ్యాప్తి ప్రమాదకరంగా పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తూ వచ్చారు. చైనా కేంద్రంగా కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రపంచానికి ముప్పు తప్పదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేసారు. ఇప్పుడు అదే నిజం అయ్యింది. కొత్తగా కేసులు వెలుగు చూస్తున్నాయి. మరోవైపు తెలంగాణలో కరోనా మళ్లీ కలకలం రేపుతోంది. ఇప్పటివరకూ 14 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం ఒక్కరోజే 6 కొత్త కేసులు వెలుగుచూశాయి.

కరోనా కొత్త సబ్ వేరియంట్ జేఎన్ 1కేసులు తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్క్ ధరించాలని అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 14 మంది కొవిడ్ బారిన పడి ఐసోలేషన్ లో ఉన్నారు. కాగా, కొత్తగా నమోదైన కేసులన్నీ కూడా హైదరాబాద్ లోనే నమోదయ్యాయి. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు.

వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, సిబ్బందితో మంత్రి దామోదర రాజనర్సింహ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జిల్లా దవాఖానలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, బస్తీ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొవిడ్ చికిత్స పరికరాలు, ఔషధాలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఎక్కడైనా కొరత ఉంటే సమకూర్చుకోవాలని నిర్దేశించారు. మాక్ డ్రిల్ వెంటనే పూర్తి చేయాలని, దవాఖానల సన్నద్ధతకు సంబంధించిన వివరాలను కేంద్రానికి పంపాలని చెప్పారు.

ఇన్ ప్లూయెంజా మాదిరిగా శ్వాసకోశ వ్యాధులతో బాధ పడుతున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దవాఖానలు, జిల్లా స్థాయిలో విభాగాధిపతులు జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం విధిగా నమూనా లను ఉప్పల్ లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింట్స్ అండ్ డయాగ్నోస్టిక్స్కు వంపాలని వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై శనివారం ఆయన మరోసారి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటివరకూ మరణాలు నమోదు కాలేదని, ఒకరు కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు అధికారులు తెలిపారు.

దేశంలోని కరోనా కొత్త వేరియంట్ జేఎన్ 1 కేసులు ఇప్పటివరకూ 21 వెలుగు చూసినట్లు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ వెల్లడించారు. ఒక్క గోవాలోనే 14 మంది దీని బారిన పడినట్లు చెప్పారు. మహారాష్ట్ర, కేరళలోనూ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. కేసులు పెరుగుతుండడంపై కేంద్రం అప్రమత్త మైంది. కొత్త వేరియంట్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, వైరస్ నియంత్రణకు కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం సజావుగా సాగాలని ఆయన ఆకాంక్షించారు. ఆస్పత్రుల్లో 3 నెలలకోసారి మాక్ డ్రిల్ నిర్వహించాలని సూచించారు.

కొవిడ్ పూర్తిగా ముగిసిపోలేదని, వైరస్ కట్టడికి కేంద్రం పూర్తిగా రాష్ట్రాలకు సహకరిస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ప్రజలు మరోమారు మాస్కులు ధరించి నిత్యం అలవాటుగా మార్చుకోవాలి. ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లేకుండా స్పీడ్గా వ్యాప్తి చెందితే అడ్డుకోవడం కూడా కష్టం కాగలదని గుర్తించాలి. అయితే కరోనా కొత్త వేరియంట్ జేఎన్ 1 అంత ప్రమాదకారి కాదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, శరవేగంగా వ్యాపించే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని, వారాంతాలు, సెలవులు కావడంతో ప్రయాణాలు తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. బయటకు వెళ్లేటప్పుడు, జన సమూహం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కచ్చితంగా మాస్కులు ధరించాలని ఖచ్చితంగా చెబుతున్నారు.

06, Jul 2024

సూరత్‌లో కుప్పకూలిన భవనం.. 15మందికి తీవ్ర గాయాలు

05, Jul 2024

ఢిల్లీలో బిజీబిజీగా సిఎం చంద్రబాబు.. పలువురు కేంద్రమంత్రులతో భేటీ

04, Jul 2024

రాష్ట్రానికి ఆర్థిక సాయం చేసి ఆదుకోండి

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP