21-12-2023 RJ
జాతీయం
న్యూఢిల్లీ, (డిసెంబర్ 21): పార్లమెంట్ భద్రతపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల పార్లమెంటులో భద్రతా వైఫల్యం చోటుచేసుకున్న క్రమంలో పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం.. పార్లమెంట్ భద్రత పర్యవేక్షణను ఢిల్లీ పోలీస్ విభాగం.. సెంట్రల్ ఇండస్ట్రియల్ సీఐఎస్ఎఫ్(సెక్యూరిటీ ఫోర్స్) కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకనుంచి ఇక నుంచి పార్లమెంటు భద్రతను సీఐఎస్ఎఫ్ పర్యవేక్షించనుంది. కాగా, పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసులో నలుగురు నిందితులకు 15 రోజుల రిమాండ్ ను ఢిల్లీ కోర్టు పొడిగించింది.
శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో పార్లమెంట్లో భారీ భద్రతా లోపం బయటపడిన విషయం తెలిసిందే. అరెస్టయిన నిందితుల్లో లోక్ సభలోకి చొరబడిన మనోరంజన్, సాగర్ శర్మ, పార్లమెంటు వెలుపల పొగ డబ్బాలు ఉపయోగించిన అమోల్ షిండే, నీలం ఆజాద్లలు ఉన్నారు. లలిత్ ఝా భద్రతా ఉల్లంఘనకు ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. లలితోపాటు అతనికి సాయం చేసిన మహేష్ కుమావత్ ను కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.