26-12-2023 RJ
జాతీయం
రూర్కీ, (డిసెంబర్ 26): ఉత్తరాఖండ్ లోని రూర్కీ లో మంగళవారం నాడు ఘోర విషాదం చోటుచేసుకుంది. లహబౌలి గ్రామంలో ఇటుక బట్టీ గోడకూలి ఆరుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. గోడ శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తెచ్చేందుకు సహాయక చర్యలు జరుగుతున్నాయి.
ప్రాథమిక సమాచారం ప్రకారం, బట్టీలో ఇటుకలు నింపుతుండగా ఈ ప్రమాదం జరిగింది. వెంటనే స్థానిక యంత్రాంగ, పోలీసులు రంగంలోకి దిగారు. జేసీబీ సాయంతో శిథిలాలను తొలగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. వైద్య సహాయక బృందం కూడా ఘటనా స్థలికి చేరుకుంది.