26-12-2023 RJ
జాతీయం
ముంబయి, (డిసెంబర్ 26): భారత్ కు వస్తోన్న వాణిజ్య నౌకలపై ఇటీవల జరిగిన దాడులను కేంద్రం తీవ్రంగా పరిగణించినట్లు రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. నౌకలపై వరున దాడుల నేపథ్యంలో సముద్ర జలాల్లో గస్తీని ముమ్మరం చేసినట్లు వెల్లడించారు. ఈ దాడులకు పాల్పడిన వారు నముద్రంలో ఎక్కడ దాక్కున్నా.. వేటాడి, పట్టుకుంటామని స్పష్టం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యుద్ధనౌక 'ఐఎన్ఎన్ ఇంఫాల్ ను ముంబయి వేదికగా నౌకాదళంలో ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి ఈమేరకు మాట్లాడారు.
భారత్ కు వస్తున్న వాణిజ్య నౌకలపై వరుస డ్రోన్ దాడులు జరుగుతుండటంపై రాజ్ నాథ్ సింగ్ సీరియన్ అయ్యారు. దాడులకు పాల్పడిన వారిని సముద్రంలో దాక్కునా వేటాడి మరీ పట్టుకుంటామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాణిజ్య నౌకలు ఎంవీ కెమ్ ప్లూటో, ఎంవీ సాయి బాబా లపై ఇటీవల జరిగిన దాడులను భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పారు. సముద్ర జలాల్లో గస్తీని ముమ్మరం చేసినట్టు తెలిపారు. ఈ నెల 23న గుజరాత్ తీరంలోని అరేబియా సముద్రంలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌక 'ఎంపీ కెమ్ ప్లూటో'పై డ్రోన్ దాడి జరగడం సంచలనమైంది.
21 మంది భారత నౌకా సిబ్బందితో ఉన్న ఈ నౌక పోర్బందర్ కు 217 నాటికల్ మైల్స్ దూరంలో ఆగిపోవడంతో భారత నౌకాదళం వెంటనే సహాయక కార్యక్రమాలు చేపట్టింది. ఐసీజీఎన్ విక్రమ్ రక్షణలో ఆ నౌకను ముంబై పోర్టుకు చేరింది. ఈ దాడి ఇరాక్ భూభాగం నుంచి జరిగిందని అమెరికా రక్షణ శాఖకు చెందిన పెంటగాన్ సంచలన ప్రకటన చేయగా, దీనిని ఇరాక్ ఖండించిది. దీనికి ముందు ఎంవీ సాయిబాబా వాణిజ్య నౌకపై కూడా దాడి జరిగింది. కాగా, మర్చెంట్ షిప్లపై కౌంటర్ పైరసీ, డ్రోన్ దాడులను తిప్పికొట్టేందుకు నాలుగు డిస్ట్రాయర్లను మోహరించినట్టు నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.
రవికుమార్ తెలిపారు. గుజరాత్ తీరానికి సమీపంలో అరేబియా సముద్రంలో ప్రయాణిస్తోన్న వాణిజ్య నౌక 'ఎంవీ కెమ్ ప్లూటో పై డిసెంబర్ 23న డ్రోన్ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సమాచారం అందుకున్న భారత నౌకాదళం వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. 'ఐసీజీఎన్ విక్రమ్' రక్షణలో ఆ వాణిజ్య నౌక ముంబయి పోర్టు ప్రాంతానికి చేరుకుంది. ఈ దాడి ఇరాన్ భూభాగంపై నుంచే జరిగిందని అమెరికా రక్షణశాఖకు చెందిన పెంటగాన్ వెల్లడించింది. అయితే, అమెరికా ఆరోపణను ఇరాన్ ఖండించింది. అంతకుముందు 'ఎంవీ సాయిబాబా పైనా దాడి జరిగింది. ఈ పరిణామాల నడుమ భారత హెచ్చరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.