29-12-2023 RJ
జాతీయం
కేరళ, (డిసెంబర్ 29): హరిహర తనయుడు అయ్యప్ప కొలువైన వ్రవిత్ర పుణ్య క్షేత్రం కేరళలోని ప్రఖ్యాత శబరిమల ఆలయం డిసెంబర్ 30న మళ్లీ తిరిగి తెరచుకోనుంది. మకర దీవ మకరవిళక్కు ఉత్సవాల్లో భాగంగా తిరిగి రేవు అయ్యప్ప ఆలయ ద్వారాలను తెరిచి భక్తులకు స్వామి దర్శనం కల్పించనున్నారు. మకర దీవ పూజల కోసం డిసెంబరు 30న సాయంత్రం 5:00 గంటలకు తిరిగి నడక తెరవబడుతుంది. శబరిమలైలో మండల పూజలతో ఈ ఏడాది మండల కాలం ముగిసింది.
దీంతో అయ్యప్ప స్వామి ఆలయం 'మండల పూజ' తర్వాత డిసెంబర్ 27న బుధవారం రాత్రి కలశాభిషేకం, కలాపాభిషేకం నిర్వహించారు. అనంతరం బంగారు వస్త్రాన్ని ధరించి ప్రత్యేక పూజలు నిర్వహించి మండల పూజా కార్యక్రమాలను ముగించారు. ఇందులో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తాత్కాలికంగా మూతవడింది. మూడు రోజుల అనంతరం రేవు ఆలయాన్ని మకర దీవ వూజల కోనం డిసెంబర్ 30న సాయంత్రం 5:00 గంటలకు తిరిగి తెరవబడుతుంది. డిసెంబర్ 31వ తేదీ తెల్లవారుజామున 3:30 గంటల నుంచి నెయ్యి అభిషేకం నిర్వహించనున్నారు.
అంతేకాదు జనవరి 13న ప్రసాద శుద్ధక్రియ, 14న బింబ శుదక్రియలను నిర్వహించనున్నారని.. జనవరి 15న మకర జ్యోతి ఉత్సవం జరుగుతుందని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ప్రకటించింది. జనవరి 20 వరకు పాదయాత్ర తెరిచి ఉంటుంది. జనవరి 21వ తేదీ ఉదయం 7:00 గంటలకు వందళం రాజు ప్రతినిధి నమక్షంలో ఊరేగింపు నిర్వహిస్తారు.
శబరిమల ఆదాయం గతేడాది కంటే తక్కువగా ఉందని క్రితం రోజు ప్రకటించిన ట్రావెన్ కోర్ దేవనం బోర్డు ఒక్కసారిగా రూ.18.72 కోట్లు పెరిగినట్లు ప్రకటించింది. లీజు వేలం ఆదాయంతో నహా ఈ ఏడాది మండల కాలానికి మొత్తం ఆదాయం రూ.241, 72, 22,711. కాగా ఇదే సమయంలో గతేడాది రూ.222,98, 70,250. దీంతో గత ఏడాది కంటే ఈ ఏడాది 18.72 కోట్ల ఆదాయం పెరిగినట్లు ట్రావెన్ కోర్ దేవనం బోర్డు అధ్యక్షుడు బి. ఎన్. ప్రశాంత్ వెల్లడించారు.