30-12-2023 RJ
జాతీయం
అయోధ్య, (డిసెంబర్ 30): అయోధ్య రైల్వే స్టేషన్ ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. సిఎం యోగి ఆదిత్యనాథ్ కలసి ప్రధాని మోడీ ప్రారంభించారు. అలాగే పలు రైళ్లకు కూడా పచ్చజెండా ఊపారు. ఇప్పటికే ఉన్న స్టేషన్ కి కొత్త హంగులు అద్ది మరింత అందంగా తీర్చి దిద్దారు. దీనికి అయోధ్య ధామ్ జంక్షన్ అని నామకణం చేవారు. దీనిని ఆధునీకరించేందుకు ప్రభుత్వం రూ.240 కోట్లు ఖర్చు చేసింది. లిప్టు, ఎస్కలేటర్లు, వెయిటింగ్ హాల్స్, క్లాక్రూమ్ తో పాటు ఫుడ్ ఏర్పాటు చేసింది. రామ మందిర ఆకృతిలోనే స్టేషన్ని తీర్చి దిద్దారు. ఆ తరవాత యోగి ఆదిత్యనాథ్, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తో కలిసి స్టేషన్ ని పరిశీలించారు. అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీకి ఎయిర్ పోర్టో స్వాగతం పలికారు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.
ఆయనతో పాటు రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్ కూడా ఉన్నారు. రైల్వే స్టేషన్ కి చేరుకునే క్రమంలో ప్రధాని మోదీ మెగా రోడ్ షో నిర్వహించారు. ఆయన అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని దారి పొడవునా ఆయనకు అభివాదం చేశారు. ఇదే స్టేషన్లో ఆరు వందేభారత్ రైళ్లతో పాటు, రెండు అమృత్ భారత్ రైళ్లకు పచ్చజెండా ఊపారు. పుష్పల్ టెక్నాలజీతో తయారు చేసిన ఈ రైళ్లు ఇప్పటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. రైల్వే స్టేషన్ని మొత్తం మూడు అంతస్తుల్లో నిర్మించారు. వందేభారత్ రైలేని ప్రారంభించిన తరవాత ఆ ట్రైన్ లో ఎక్కారు ప్రధాని మోదీ.
విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఈ స్టేషన్ లో ఇంకెన్నో ప్రత్యేకతలున్నాయి. చిన్నారుల కోసం ప్రత్యేకంగా వసతులు అందుబాటులో ఉన్నాయి. సిక్రూమ్ కూడా నిర్మించారు. టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నీ ఏర్పాటు చేశారు. సటేషన్ టాప్ ప్లోర్ ని రాముని విల్లు ఆకారంలో నిర్మించారు. అంతే కాదు. ఇందులో ఎయిర్ పోర్ట్ తరహా వసతులు కల్పించారు. ట్యాక్సీ బే కూడా ఉంది. అయోధ్యలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం పర్యటిస్తున్న సందర్భంగా అయోధ్య లో ఆధునిక హంగులు, రామమందిర చిత్రాలతో పునరుద్ధరించిన అయోధ్య రైల్వేస్టేషన్ ను ప్రధాని ప్రారంభించారు. ఆయన వెంట యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తదితరులు ఉన్నారు. రైల్వే స్టేషన్ విశేషాలను మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రధానికి వివరించారు.
అనంతరం ప్రధాని మోదీ రెండు అమృత్ భారత్, ఆరు వందే భారత్ రైళ్లకు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు అమృత్ భారత్ రైల్లోకి వెళ్లి విద్యార్థులతో కొంతసేపు ముచ్చటించారు. పర్యటనలో భాగంగా అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మోదీ ప్రారంభిస్తారు. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ నాన్ ఏసీ రైలు పుష్-పుల్ రైలు. ముందూ వెనుక ఇంజిన్లు ఉంటాయి. దీనివల్ల తక్కువ సమయంలోనే రైలు వేగాన్ని అందుకోవడం తోపాటు, ప్రయాణ సమయం ఆదా అవుతుంది. ఇందులో 22 కోచ్ లు ఉంటాయి. 12 సెకండ్ క్లాస్ త్రీటైర్ స్లీపర్ కాగా.. 8 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు, రెండు గార్డు కంపార్ట్మెంట్స్ ఉంటాయి.
ఈ 2 కంపార్ట్మెంట్లలోనే కొంత భాగాన్ని మహిళలకు, దివ్యాంగులకు ప్రత్యేకంగా కేటాయిస్తారు. ఈ రైళ్లు గరిష్ఠంగా 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఉదయం అయోధ్య చేరుకున్న ప్రధానికి రాష్ట్ర గవర్నర్ ఆనందిబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్పోర్టు నుంచి ఆయన రోడ్ షోలో పాల్గొన్నారు. రైల్వే స్టేషన్ వరకు 15 కిలోమీటర్ల మేర జరిగిన ఈ రోడ్ షోలో దారి పొడవునా ప్రధానికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. మధ్య మధ్యలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 1,400 మంది కళాకారులు ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.